TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

IND vs WI 1st ODI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.!

Published on: Sun Sep 27, 2026 2:11PM

తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్  టాస్ గెలించింది. భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్  బౌలింగ్ ఎంచుకున్నాడు.ఈ కీలక పోరు ద్వారా పంజాబ్‌కు చెందిన యువ ఆల్‌రౌండర్ నమన్ ధీర్ అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. దేశీయ క్రికెట్ అలాగే ఐపీఎల్‌లో ముంబై ఇండయన్స్ తరఫున అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఈ యువ ఆటగాడికి సెలక్టర్లు తుది జట్టులో చోటు కల్పించారు. అతనికి తోటి ఆటగాళ్లు తొలి క్యాప్‌ను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.   

మరోవైపు, సీనియర్ పేసర్ మొహ్మద్ సిరాజ్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చినట్లు మేనేజ్‌మెంట్ తెలిపింది. పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తొలుత ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడమే లక్ష్యంగా భారత బౌలర్లు రంగంలోకి దిగుతున్నారు.ఈ సిరీస్ ద్వారా భారత జట్టులోకి సీనియర్ బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి పునరాగమనం చేయడం విశేషం. వీరిద్దరి రాకతో భారత బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా మారగా, అభిమానుల్లో కూడా ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  

 

వెస్టిండీస్ జట్టు కూడా 2027 వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయర్స్ సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కరేబియన్ జట్టు తమ బలహీనతలను సరిదిద్దుకుని పటిష్టమైన ప్రదర్శన కనబరచాలని పట్టుదలగా ఉంది.తొలి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు ప్రారంభంలోనే భారత బౌలర్ల నుంచి గట్టి సవాలును ఎదుర్కొంటోంది. పవర్‌ప్లేలో వీలైనన్ని త్వరగా వికెట్లు తీసి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయాలని టీమిండియా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.  యువ ఆటగాడు నమన్ ధీర్ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే బంతితోనూ, బ్యాట్‌తోనూ ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. క్రీడాభిమానులంతా ఈ ఉత్కంఠభరిత పోరులో ఎవరు పైచేయి సాధిస్తారనే దానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

భారత తుది జట్టు:
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ.

వెస్టిండీస్ తుది జట్టు:
జాన్ క్యాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్, కేసీ కార్టీ, షాయ్ హోప్ (కెప్టెన్/వికెట్ కీపర్), అమీర్ జంగూ, జ్యువెల్ ఆండ్రూ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, గుడకేశ్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్.

 

 

[ India vs West Indies, 1st ODI, Naman Dhir debut, Shubman Gill, Cricket News Telugu, Rohit Sharma, Virat Kohli, Ruturaj Gaikwad, KL Rahul, BCCI,Shai Hope ]