TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇండియా అమెరికా వాణిజ్య ఒప్పందం: దారులు మూసుకుపోయాయా.. విత్త మంత్రి మాటల సారాంశం అదేనా?

Published on: Mon Oct 5, 2026 2:29PM

ఇటీవలి కాలంలో  ఇండియా, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎన్నో ఒడిదుడుకులు, కుదుపులు ఎదుర్కొన్నాయి.   అమెరికా అధ్యక్షుడు ఉన్న డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న  సుంకాల విధింపు విధానాల వల్ల ఇరు దేశాల మధ్యా వాణిజ్య రంగంలో తీవ్రమైన అనిశ్చితి, సందిగ్ధత  నెలకొంది. ఈ నేపథ్యంలో వాణిజ్య ఒప్పందాల పురోగతిపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇరు దేశాల మధ్యా వాణిజ్య ఒప్పందం చర్చలు విఫలమైనట్లేననీ, ఒప్పందానికి దారులు మూసుకుపోయినట్లేననీ పరిశీలకులు అంటున్నారు. 

ఇండియా విత్త  మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై ఆశలు వదిలేసుకున్నట్లే అని పరోక్షంగా చెప్పారు. ఒప్పందం కుదరడం పట్ల ఆశ ఇసుమంతైనా లేదన్నట్లుగా మాట్లాడారు.  అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగుతున్నప్పటటికీ,  ఇరు పక్షాలు డెడ్ ఎండ్ కు    చేరుకున్నాయనీ   రాయితీలు ఇచ్చి పుచ్చుకునే విషయంలో అనేక అడ్డంకులు ఏర్పడ్డాయని నిర్మలా సీతారామన్ అన్నారు.  ఒకవేళ ఇంకా చర్చలకు,  మార్పులకు అవకాశం ఉంటే.. ఆ దిశగా ఇరు దేశాలు ప్రయత్నిస్తాయని ఒకింత నిరాశా జనకంగా చెప్పారు.  

అయితే.. భారత్ మరియు అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలలో ప్రధాన అంశం వాణిజ్య సమతుల్యత మనకు అనుకూలంగా ఉండటం అన్న నిర్మలా సీతారామన్..  సహజంగానే, వారి వైపు లోటు  ఉంది. అంటే వాణిజ్య సమతుల్యత అగ్రరాజ్యానికి ప్రతికూలంగా మారుతోందని చెప్పారు.  అదే సమయంలో ఇరు దేశాల మధ్యా చర్చలు ప్రస్తుతం నిలిచిపోయాయని అంగీకరించిన ఆమె.. ఇక రాయతీలు ఇచ్చి పుచ్చుకోవడం కుదరకపోవచ్చని చెప్పారు.  


[India US trade Deal, Dead End, Dead Lock, Nirmala Sitharaman, US Tariffs, Donald Trump, India US Relations, Telugu One]