మహిళల ఆసియా కప్.. పాక్ ను చిత్తు చేసిన టీమ్ ఇండియా.!
Published on: Sun Sep 6, 2026 9:29AM

దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అప్రతిహాత విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న టీమ్ ఇండియా మహిళల క్రికెట్ జట్టు నిన్న జరిగిన మ్యాచ్ లో దాయాది దేశం పాకిస్థాన్ జట్టుపై ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ తో జరిగిన పోరులో భారత జట్టు బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 18.1 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది.మహిళల టి20లో పాకిస్థాన్ కు ఇదే అత్యల్ప స్కోరు. పాక్ బ్యాటర్లలో షవాల్ జుల్ఫిగర్, మునాబా అలీ మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మునాబా అలీ 13 పరుగులు, షవాల్ జుల్ఫిగర్ 14 పరుగులు చేయగా, మిగతా బ్యాటర్లెవరూ రెండంకెల స్కోరు అందుకోలేకపోయారు.

భారత బౌలర్లలో శ్రీ చరణి 7 పరుగులొచ్చి 3 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నారు. మరోవైపు లెగ్ స్పిన్నర్ ప్రేమా రావత్ కూడా చి 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. అలాగే దీప్తి శర్మ 5 పరుగులకు 2 వికెట్లు, షఫాలీ వర్మ 10 పరుగులకు 1 వికెట్ తీసి పాకిస్థాన్ పతనాన్ని శాసించారు.
56 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ షఫాలీ వర్మ ఇన్నింగ్స్ మొదటి బంతినే సిక్సర్‌తో ప్రారంభించి దూకుడు ప్రదర్శించింది. షఫాలీ వర్మ 6 బంతుల్లో 12 పరుగులు చేసింది. ఈ క్రమంలో మహిళల టీ20 క్రికెట్‌లో 3000 పరుగులు పూర్తి చేసుకున్న అతిపిన్న వయస్కురాలిగా రికార్డు సాధించింది. ఇక భారత్ విజయ లక్ష్యాన్ని 8.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించి తిరుగులేని విజయాన్నందుకుంది.
[India Spectacular Win On Pakistham, Womens Asia Cup 2026, India vs Pakistan, Harmanpreet Kaur, Shree Charani, Indian Women Cricket]


