కివీస్ పై రెండో వన్డేలోనూ టీమ్ ఇండియా విజయం: స్వల్ప లక్ష్య ఛేదనలో చమటోడ్చిన భారత్.!
Published on: Sat Nov 7, 2026 3:30PM

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా రెండో విజయాన్ని నమోదు చేసింది. వెల్లింగ్టన్ వేదికగా శనివారం (నవంబర్ 7) జరిగిన రెండో వన్డేలో నాలుగు పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది. వర్షం కారణంగా భారత్ డక్‌వర్త్ లూయిస్ (డీఎల్ఎస్) పద్ధతిలో 4 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఉత్కంఠభరిత విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.
వర్షం కారణంగా టాస్ వేయడంలో ఆలస్యం కావడంతో అంపైర్లు ఈ మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నటీమ్ ఇండియా.. కివీస్ బ్యాటర్లను క్రీజ్ లో కుదురుకోనీయలేదు. భారత బౌలర్లు పదునైన బంతుల్లో న్యూజిలాండ్ బ్యాటర్లను పరుగులు చేయకుండా కట్టడి చేయడమే కాకుండాక్మం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. దీంతో కివీస్ 41 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. కివీస్ జట్టులో డారిల్ మిచెల్ 55 పరుగులతో రాణించాడు. కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 31 పరుగులతో ఫరవాలేదనిపించాడు.
భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్ అద్భుతంగా రాణించి 30 పరుగుల ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఆకిబ్ నబీ, అన్షుల్ కాంబోజ్, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాశించారు.

అనంతరం 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు కివీస్ బౌలర్లు చెమటలు పట్టించారు. ఆరంభం నుంచే క్రమంగా వికెట్లు కోల్పోయిన టీమిండియా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. ఓపెనర్ రోహిత్ శర్మ 23 పరుగులు చేశాడు.
ఇది కూడా చదవండి: కివీస్‌తో తొలి వన్డే: భారత్ అద్భుత విజయం.. మెరిసిన కోహ్లీ.!
మిగతా బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ 30 పరుగులు, కేఎల్ రాహుల్ 26 పరుగులు నాటౌట్ మాత్రమే పర్వాలేదనిపించారు. నమన్ ధిర్ మినహా మిగిలిన ఆటగాళ్లు విఫలమయ్యారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ చెరో 7 పరుగులు చేసి వెనుదిరగగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు.

భారత్ 26 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసిన దశలో వాతావరణం సహకరించక వర్షం మళ్లీ మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. ఆ సమయంలో డీఎల్ఎస్ నిబంధనల ప్రకారం భారత్ నాలుగు పరుగుల ఆధిక్యంలో ఉండటంతో, అంపైర్లు భారత్‌ను విజేతగా ప్రకటించారు. స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడినప్పటికీ, పట్టువదలకుండా పోరాడి, ఒత్తిడిపి అధిగమించి ఇండియా గెలుపొందింది. ఇకఇరు జట్ల మధ్య అ మూడో వన్డే మ్యాచ్ రాబోయే మంగళవారం జరగనుంది.
మీకు నచ్చవచ్చు: న్యూజిలాండ్‌తో తొలి వన్డేకు మొహమ్మద్ సిరాజ్ దూరం.. అసలు కారణం ఇదే!
న్యూజిలాండ్‌లో రోహిత్ శర్మ బద్దలు కొట్టే 4 భారీ రికార్డులు ఇవే!
[IND Win 2nd ODI Newxwland , India vs New Zealand 5ODI Series, Wellington ODI Match, 4Runs Victory. Series, India Ahead, TeluguOne]


