IND vs WI: టాస్ గెలిచిన వెస్టిండీస్..భారత్ బ్యాటింగ్.!
Published on: Fri Oct 9, 2026 6:51PM

రాంచీ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రసవత్తరంగా సాగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ స్వభావం మంచు (డ్యూ) ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విండీస్ కెప్టెన్ వెల్లడించారు. తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలని కరేబియన్ జట్టు పట్టుదలగా ఉంది.
మరోవైపు టాస్ ఓడినప్పటికీ ముందుగా బ్యాటింగ్‌కు దిగడం పట్ల టీమిండియా మేనేజ్‌మెంట్ సానుకూలంగానే ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలని భారత జట్టు భావిస్తోంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా తమ ప్లేయింగ్ లెవెవ్‌లో పలు కీలక మార్పులతో బరిలోకి దిగుతోంది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ జట్టులో చోటు దక్కించుకున్నారు.

అలాగే ఆల్ రౌండర్ కోటాలో శివమ్ దూబే, నమన్ ధీర్, అక్షర్ పటేల్ జట్టుకు బలాన్ని చేకూరుస్తున్నారు. బౌలింగ్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మయాంక్ యాదవ్ తమ వేగంతో ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు సిద్ధమయ్యారు.ఇక వెస్టిండీస్ జట్టు తరఫున హోప్, కమిల్, హెట్మెయర్, పావెల్, రూథర్‌ఫోర్డ్ వంటి పవర్ హిట్టర్లు ఉన్నారు. మిడిలార్డర్‌లో ఛేజ్, షెఫర్డ్ రాణించాలని ఆ జట్టు ఆశపడుతోంది.
బౌలింగ్‌లో మోటీ, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, స్ప్రింగర్ భారత్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇరు జట్లూ సమవుజ్జీగా ఉండటంతో ఈ మ్యాచ్‌లో హోరాహోరీ పోరు తప్పదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.రాంచీ మైదానంలో పరుగుల వర్షం కురిసే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. సిరీస్‌లో ఆధిక్యం సాధించాలంటే ఇరు జట్లూ తమ సర్వశక్తులూ ఒడ్డాల్సిందే.
[ IND vs WI 2nd T20, India vs West Indies Ranchi T20, Toss Update, Team India playing XI, West Indies bowling, BCCI, Telugu One, Telugu News, Aqeel Hossain, Alzarri Joseph ]


