Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నీరు చల్లగా ఉండాలంటే.. మట్టికుండ కొనేముందు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి..!
posted on: Apr 2, 2026 11:20AM

వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది. పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది. నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు. అయితే ఆరోగ్యంగా చల్లని నీరు తాగాలంటే.. మట్టి కుండలు మంచి ఆప్షన్.. ఇది చల్లదనాన్నే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మార్కెట్లో మట్టి కుండ కొనడం అంత సులభం కాదు. సరైన దానిని ఎంచుకోవడం చాలా ముఖ్యం, లేకపోతే నీరు అస్సలు చల్లగా ఉండదు. మట్టికుండ కొనుగోలు చేసేటప్పుడు మంచిది ఎన్నుకోవాలంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి.
మట్టికుండ కొనుగోలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవలసిన విషయాలు..
రంగు వేసిన కుండలు..
రంగులు వేసిన కుండను ఎప్పుడూ కొనకూడదు. వాటిలో రసాయన రంగులను ఉపయోగిస్తారు, అవి చూడటానికి అందంగా కనిపించినా ఆరోగ్యానికి హానికరం.
కుండలో రంధ్రాలు..
కుండకు లీకులు లేదా రంధ్రాలు ఉన్నాయేమో తనిఖీ చేయాలి. కుండ కొనేటప్పుడే కుండలో నీళ్లు నింపి వెంటనే తనిఖీ చేయండి.
కుండ ఆకారం..
కుండ ఆకారాన్ని పరిగణనలోకి తీసుకోడం చాలా ముఖ్యం. కుండ మరీ పలుచగా లేదా మరీ మందంగా ఉండకూడదు, లేకపోతే నీరు చల్లబడదు. సరైన మందం ఉన్న కుండను ఎంచుకోవాలి.
వెడల్పాటి మూతి..
మార్కెట్లో కుండ కొనేటప్పుడు, వెడల్పాటి మూతి ఉన్నదాన్ని ఎంచుకోవాలి. దానివల్ల కుండను నింపడం, నీటిని తీసివేయడం, శుభ్రపరచడం చాలా సులభం అవుతుంది. దానిలోని నీరు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
*రూపశ్రీ.






