TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ముప్పేట దాడి.!

Published on: Mon Sep 21, 2026 9:20AM

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెను ముప్పు ముంగిట ఉందా? అంటే అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ (ఐఎంఎఫ్) ఔననే అంటోంది. మేడిపండు చందంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చూడడానికి మెరుగ్గా ఉందని పించినా, ద్రవ్యోల్బణం, అప్పులు, ఏఐ సవాళ్లుగా మారుతున్నాయని హెచ్చరించింది.  న్యూయార్క్‌లో ఆదివారం (సెప్టెంబర్ 20) జరిగిన ఖతార్‌ ఎకనామిక్‌ ఫోరం లో మాట్లాడిన ఐఎంఎఫ్ చీఫ్ చీఫ్‌ క్రిస్టలినా జార్జీవా   ద్రవ్యోల్బణం ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించడం లేదన్నారు.

ధరలు అదుపులోకి తెచ్చేందుకు పలు దేశాల  బ్యాంకులు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని వివరించారు. దీంతో ప్రభుత్వాలు, సంస్థలపై అప్పుల చెల్లింపు భారం  పెరుగుతోందని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణ తెలిసినా.. ప్రపంచ దేశాలు అందుకు సంబంధించి అరకొర చర్యలు మాత్రమే తీసుకుంటున్నాయన్నారు.  

ఇక ఏఐ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో మూడో ప్రమాదం పొంచి ఉందనిన్న  క్రిస్టలినా జార్జీవా.. ఈ పెట్టుబడుల్లో అప్పులపై ఆధారపడటం, ఒకే రకమైన నిధులు పలుమార్లు పెట్టుబడిగా మారడం వంటి  ప్రమాదకరంగా మారుతున్నాయన్నారు. ఏఐపై ఉన్న  అంచనాలు అందుకోవడంలో విఫలమైతే.. ఆర్థిక వ్యవస్థపై మోయలేని భారం పడటం ఖాయమన్నారు.  ఏఐ పెట్టుబడులకు సంబంధించిన ప్రధాన ఆర్థిక ప్రమాదం అగ్రరాజ్యంలో కేంద్రీకృతమై ఉందన్న ఆమె..  ఆసియా, ఐరోపాలోని పలు దేశాలు ఏఐ సరఫరా వ్యవస్థలో భాగంగా ఉన్నాయని చెప్పారు. వచ్చే నెలలో విడుదల కానున్న   ప్రపంచ ఆర్థిక అంచనాల్లోనూ ఈ ప్రమాదాలు కొనసాగుతాయని జార్జీవా వివరించారు.  


[IMF Chief Kristalina Georgieva, Global Economy Threats, Inflation Risks, Artificial Intelligence Investments, Debt Burden]