TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన: మూడు రోజుల పాటు వానలే వానలు.!

Published on: Fri Oct 23, 2026 4:45PM

ఉభయ తెలుగు రాష్ట్రాలకూ వాతావరణ శాఖ భారీ వర్ష సూచనచేసింది.  తీర ప్రాంతాలతో పాటు పలు   జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్  కోస్తా తీర ప్రాంతాలతో పాటు రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో రాబోయే రెండు రోజులలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.  అలాగే తెలంగాణలో కూడా వచ్చేమూడు రోజులూ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే సమయాల్లో పిడుగుపాటుకు అవకాశాలున్నందున విద్యుత్ స్తంభాలు, చెట్లకింద నిలబడవద్దని హెచ్చరించింది. ఒక రైతులు కోత దశకు వచ్చిన పంటలను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు.  


[IMD, Heavy Rain Alert Telugu States,  Andhra Pradesh, Telangana 3days, Costal Andhra, Rayalaseema, Telugu One]