TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గేట్ వే ఆఫ్ ఏపీ ఇచ్చాపురం ఏదో తెలుసా?

Published on: Sat Sep 5, 2026 9:36AM

ఇచ్ఛాపురాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామనీ, గేట్ వే ఆఫ్ ఏపీ ఇచ్చాపురం అన్న గుర్తింపునకు సార్థకత చేకూరుస్తామనీ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మెహన్ నాయుడు చెప్పారు. రాష్ట్రంలో  మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించిన  ఆయన ఇచ్ఛాపురం కు సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు.  

ఈ ప్రాంతానికి  సమీపంలో శరవేగంగా రూపుదిద్దుకుంటున్న ములపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు ప్రాజెక్టు ఇచ్ఛాపురం అభివృద్ధికి   చోదక శక్తిగా మారుతుందన్న కేంద్ర మంత్రి కింజరాపు.. ఓడరేవు నిర్మాణానికి అనుబంధంగా ఈ ప్రాంతంలో పారిశ్రామిక రంగం పరుగులు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  పోర్టు ఆధారిత పరిశ్రమలను తీసుకురావడం ద్వారా  స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయనీ, తద్వారా నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అన్నారు.

ఇప్పటికే ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో అనేక అభివృద్ధి కొనసాగుతున్నాయని వివరించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు..  ప్రజలకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన రహదారుల నిర్మాణం, రైల్వే ఓవర్ బ్రిడ్జిల  ఏర్పాటు వంటి పనులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అలాగే, స్థానిక ప్రయాణికుల సౌకర్యార్థం ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌ను  ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 

మూలపేట పోర్టు నిర్మాణం పూర్తయితే..  ఈ ప్రాంతం కేవలం రవాణా మార్గంగానే కాకుండా, రాష్ట్రానికి  వాణిజ్య,  పారిశ్రామిక హబ్‌గా మారుతుందనీ,  సరిహద్దు ప్రాంతమైనప్పటికీ సకల  సదుపాయాలతో దీనిని రాష్ట్రానికి తలమానికంగా తీర్చిదిద్దడమే   లక్ష్యమని మంత్రి  కింజరాపు ఉద్ఘాటించారు.   

[Ichchapuram The Gate Way Of AP,  development, Union Minister Rammohan Naidu, , Mulapeta Port, Srikakulam infrastructure, Telugu one]