ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి .. రూ.3 కోట్లు ఇవ్వాలంటూ ఐబొమ్మ రవి పిటిషన్..!
Published on: Wed Sep 16, 2026 3:04PM

సినీ ప్రపంచాన్నే గడగడలాడించడమే కాకుండా పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ రవిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న ఐబొమ్మ రవి.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నానంటూ కోర్టును ఆశ్రయించడంతో మరోసారి ఆయన వ్యవహారం వార్తల్లోకి వచ్చింది.అరెస్ట్ సమయంలో పోలీసులు తన బ్యాంక్ ఖాతాల్లో ఉన్న సుమారు రూ.3 కోట్లను ఫ్రీజ్ చేశారని రవి పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని అన్‌ఫ్రీజ్ చేయాలని కోరుతూ ఐబొమ్మ రవి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ కావడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నానని పిటిషన్‌లో పేర్కొన్నారు.

తెలుగు సినిమాల పైరసీకి సంబంధించిన iBomma, Bappam వెబ్‌సైట్ల వ్యవహారంలో ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించి 2025 నవంబర్‌లో అరెస్ట్ చేశారు. పైరసీ కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడంతో పాటు, ఆ వెబ్‌సైట్ల ద్వారా వచ్చే ట్రాఫిక్‌ను బెట్టింగ్ ప్రకటనలకు మళ్లించాడు. కొత్తగా విడుదలైన సినిమాల పైరసీ కాపీలను వివిధ మార్గాల్లో సంపాదించి iBomma, Bappam వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో అప్‌లోడ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దర్యాప్తులో భాగంగా రవికి సంబంధించిన బ్యాంక్ ఖాతాల్లోని సుమారు రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఆ మొత్తానికి సంబంధించిన లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.అయితే ఇప్పుడు అదే మొత్తాన్ని అన్‌ఫ్రీజ్ చేయాలని రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.

ఖాతాలు ఫ్రీజ్ కావడంతో తన ఆర్థిక వనరులు నిలిచిపోయాయని, కుటుంబ అవసరాలను తీర్చడం కూడా కష్టంగా మారిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.తన బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ కావడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని రవి పిటిషన్‌లో పేర్కొన్నారు. కుటుంబ జీవనం సాగించేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నానని తెలిపారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు, రోజువారీ అవసరాలను తీర్చుకునేందుకు తన ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేసి, అందులోని నగదును వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోర్టును కోరారు. అరెస్ట్ అనంతరం ఇమ్మడి రవి కొంతకాలం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అనంతరం తెలంగాణ హైకోర్టు 2026 ఫిబ్రవరిలో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
దాదాపు 100 రోజుల జైలు అనంతరం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు.అయితే బెయిల్ లభించినప్పటికీ.. పైరసీ కేసుకు సంబంధించిన దర్యాప్తు, ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలపై విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రీజ్ చేసిన రూ.3 కోట్లను అన్‌ఫ్రీజ్ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టును రవి ఆశ్రయించడం కేసులో మరో కీలక పరిణామంగా మారింది. ఒకవైపు పైరసీ, ఆన్‌లైన్ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా.. మరోవైపు కుటుంబ జీవనం కోసం తన బ్యాంక్ ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేయాలని రవి కోర్టును కోరుతున్నారు.3 కోట్ల అన్‌ఫ్రీజ్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
[ ibomma Ravis petition, Bappam websites, Movie piracy, ₹3 Crore Freeze, Frozen Funds, Court Petition, Nampally Court, Financial Issues, Bank Account Freeze, Ravi Petition, iBOMMA Case, Hyderabad Court, iBOMMA Latest News, Ravi Latest News ]


