TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ: ఇండియాకు డబుల్ టైటిల్స్: సత్తా చాటిన పీవీ సింధు, లక్ష్య సేన్.!

Published on: Mon Nov 2, 2026 7:56AM

బ్యాడ్మింటన్ లో ఇండియా మరోసారి  చారిత్రాత్మక విజయాలు సాధించింది.  జర్మనీ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక హైలో ఓపెన్ టోర్నమెంట్‌లో  భారత షట్లర్లు సత్తా చాటారు. హిళల, పురుషుల టైలిళ్లను గెలుచుకుని  చరిత్ర సృష్టించారు.  ఇండియన్ ఏస్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు మహిళల సింగిల్స్ టైటిల్ ను,  లక్ష్యసేన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను గెలుచుకుని ఇండియాకు డబుల్ టైటిల్స్ అందించారు.  

ఈ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో పోటీ పడిన పీవీ సింధు ఆరంభం నుంచి అద్భుత ఫామ్ కనబరిచింది.  ఫైనల్ పోరులో డెన్మార్క్‌కు చెందిన లైన్ జేర్స్‌ఫెల్డ్‌తో తలపడిన సింధు, కేవలం 39 నిమిషాల్లోనే 21-12, 21-14 తేడాతో  వరుస సెట్లతో ప్రత్యర్థిని చిత్తు చేసి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో హైలో ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 

 ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో ఇండియన్ షట్లర్ లక్ష్య సేన్ తనకంటే మెరుగైన ర్యాంక్ కలిగిన ఇండోనేషియా ఆటగాడు జోనాటన్ క్రిస్టీపై 21-17, 21-10 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించారు.  

గతంలో జపాన్ ఓపెన్‌లోనూ సత్తా చాటిన పీవీ సింధుకి ఈ ఏడాది ఇది రెండో టైటిల్ కావడం విశేషం. అలాగే గత సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకున్న లక్ష్యసేన్ మళ్లీ టైటిల్ విజేతగా నిలిచారు. 2019లో తొలిసారిగా హైలో ఓపెన్ గెలుచుకున్న సేన్, ఇప్పుడు మరోసారి అదే టోర్నమెంట్‌లో ట్రోఫీని కైవసం చేసుకోవడం విశేషం. 

[Hylo Open Titile Winners, PV Sindhu Lakshya Sen badminton, India Double Glory, Indian Shutlers, Telugu one]