TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో భారీ ఊరట..!

Published on: Tue Sep 1, 2026 4:23PM

 

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనను పదవి నుంచి తొలగించాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలకు డివిజన్ బెంచ్ తాత్కాలికంగా బ్రేక్ వేసింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ రంగనాథ్ తరఫున దాఖ లైన అప్పీల్‌పై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్.. గతంలో ఇచ్చిన ఆదేశా లను సస్పెండ్ చేసింది. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్ కొనసాగడంపై గతంలో సింగిల్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని సింగిల్ బెంచ్ ఆదేశించడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తం గా చర్చనీయాంశంగా మారింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ రంగనాథ్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో దాఖలైన అప్పీల్‌పై డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ప్రస్తుతానికి సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ నిర్ణయం తీసు కుంది. దీంతో రంగనాథ్‌కు తక్షణ ఉపశమనం లభించినట్లయింది. సింగిల్ బెంచ్ ఆదేశాల అమలుపై నిలుపుదల రావడంతో ఆయన హైడ్రా కమిషనర్‌గా కొనసాగేం దుకు ప్రస్తుతం న్యాయపర మైన అడ్డంకి తొలగిన ట్లైంది.హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు ఆక్రమణల తొలగింపు వంటి అంశాల్లో హైడ్రా కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కమిషనర్ రంగనాథ్‌పై వచ్చిన న్యాయపరమైన పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

 సింగిల్ బెంచ్ తీర్పుతో హైడ్రా వ్యవహారాల్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, డివిజన్ బెంచ్ తాజా ఆదేశాలతో ఆ పరిస్థితికి తాత్కాలికంగా తెరప డింది. అయితే, ఇది తుది తీర్పు కాదని, సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై దాఖ లైన అప్పీల్‌పై తదుపరి విచారణ కొనసాగనుంది. కేసుకు సంబంధించిన పూర్తి అంశాలను డివిజన్ బెంచ్ తదుపరి విచారణ లో పరిశీలించనుంది. ఈ కేసులో తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై సస్పెన్షన్ కొనసాగనుంది. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఇది కీలకమైన న్యాయపరమైన ఊరటగా మారింది.


HYDRA Commissioner, A.V. Ranganath, Telangana High Court, HYDRA Demolitions, Shanta Sriram Constructions, CM Revanth reddy,  GHMC, Telugu one, Telugu news