ఉసురు తీసిన ఉద్యోగాన్వేషణ.. అమెరికాలో హైదరాబాద్ యువకుడి ఆత్మహత్య.!
Published on: Mon Aug 24, 2026 10:00AM
.webp)
అమెరికాలో స్థిరపడి, మంచి భవిష్యత్ ను నిర్మించుకోవాలని కలలు కన్న ఓ ఒక తెలుగు యువకుడు.. ఆ కలలు ఫలించే అవకాశం కనిపించక నిరాశతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్నత విద్యను అభ్యసించి, ఎంతో కాలంగా ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ముస్తి సాయి ప్రదీప్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చాలా కాలంగా ఉద్యోగం లభించక, ఆర్థిక ఇబ్బందులను తాళలేని, మానసిక ఒత్తిడి కారణంగా సాయి ప్రదీప్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ అంటోనియో ప్రాంతంలో నివాసముంటున్న సాయి ప్రదీప్ చాలా కాలంగా ఉద్యోగం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడు అక్కడి ప్రముఖ అండర్సన్ యూనివర్సిటీ ఆఫ్ బిజినెస్ నుండి మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకున్నాడు. చదువు పూర్తి కావడమే కాకుండా, సప్లై చైన్ అనలిస్ట్‌గా అతనికి దాదాపు ఐదేళ్ల పాటు పనిచేసిన అనుభవం కూడా ఉంది. నైపుణ్యాలు, అనుభవం ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల కారణంగా అమెరికాలో అతడికి సరైన ఉద్యోగావకాశం లభించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఉద్యోగ రంగంలో నెలకొన్న మందగమనం, రిట్రెంచ్ మెంట్లు, కఠినమైన నియామక ప్రక్రియలు సాయి ప్రదీప్‌ను తీవ్ర నిరాశకు గురిచేశాయి.
ఈ నేపథ్యంలోనే తనకు అమెరికాలో ఉద్యోగం లభించే అవకాశం మృగ్యమన్న భావనకు వచ్చిన సాయి ప్రదీప్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ వార్త హైదరాబాద్ లోని అతడి కుటుంబ సభ్యులను విషాద సాగరంలో ముంచేసింది. సాయి ప్రదీప్ భౌతికకాయాన్ని మాతృభూమికి తీసుకురావడానికి, అంత్యక్రియల నిర్వహణ ఖర్చులు భరించడానికి కుటుంబ సభ్యులు ఒక ఫండ్‌రైజర్ ద్వారా ఆన్‌లైన్ సాయాన్ని కోరుతున్నారు.
Hyderabad youth sucide in America, US job market crisis, Texas Telugu student suicide, Sai Pradeep Anderson University


