Hyderabad: 30వ అంతస్తు నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.!
Published on: Tue Oct 13, 2026 9:03AM

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌లోని 30వ అంతస్తు నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ఉప్పల భరత్(29) బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత రెండు రోజుల క్రితమే భరత్ నానక్‌రామ్‌గూడలోని గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో అద్దెకు దిగినట్లు తెలిసింది. సోమవారం భవనం 30వ అంతస్తు నుంచి దూకిన అతడు పార్కింగ్‌లో నిలిపి ఉంచిన హ్యుందాయ్ వ్యాగనార్ కార్లపై పడ్డాడు.

పెద్ద ఎత్తున శబ్దం రావడంతో స్థానికులు బయటకు వచ్చి చూడగా...భరత్ రక్తం మడుగులో పడి ఉన్నాడు . అది చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం స్థానికులు తీవ్ర గాయాలపాలైన అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని స్టార్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు.మృతుడి బంధువు ఉప్పల కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. భరత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అసలు భరత్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు మరణవార్త విన్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
[ Hyderabad News, Nanakramguda, Golf Edge Apartments, Software Employee Death, Uppala Bharat, Hyderabad Suicide Case, Gachibowli Police, Software Engineer Death, 30th Floor Incident, Suryapet District, Star Hospital Hyderabad, Osmania Hospital, Hyderabad Crime News ]


