TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

క్షణాల నిర్లక్ష్యం.. వేడి నీళ్ల బకెట్‌లో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి.. !

Published on: Fri Sep 11, 2026 1:22PM

ఓ తల్లి స్నానం కోసం వేడి చేస్తున్న నీళ్లు.. అదే ఇంట్లో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి పాలిట ప్రాణాంత కంగా మారాయి. తల్లికి వచ్చిన ఓ ఫోన్ కాల్‌తో ఆమె కాసేపు బయటకు వెళ్లగా.. అంతలోనే ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. వేడి నీళ్ల బకెట్‌లో పడి తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల చిన్నారి చికిత్సపొందుతూ మృతి చెందింది. ఈ విషాద ఘటనతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని మైలార్దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి రాజేంద్రనగర్ మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్‌లో నివాసం ఉంటున్నారు దంపతులిద్దరూ ఓ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించు కుంటున్నారు. 

వీరికి నాలుగేళ్ల కుమార్తె మానస ఉంది. రోజువారీగా కంపెనీ లో పని ముగించుకుని ఇంటికి వచ్చిన మానస తల్లి.. స్నానం చేసేందుకు బకెట్‌లో నీళ్లు పోసి వాటర్ హీటర్ పెట్టి వేడి చేస్తోంది. అదే సమయంలో ఆమెకు ఫోన్ రావడంతో మాట్లాడేందుకు కాసేపు బయటకు వెళ్లింది. ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి మానస.. ప్రమాదవశాత్తూ వేడి నీళ్లతో ఉన్న బకెట్‌లో పడిపోయింది.  నొప్పితో మానస గట్టిగా కేకలు వేయడంతో తల్లి పరుగున ఇంట్లోకి వచ్చింది. వేడి నీళ్లలో పడిపోయిన చిన్నారిని వెంటనే బయ టకు తీసింది. కానీ అప్పటికే వేడి నీళ్లలో పడటంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే మానసను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

వైద్యులు చికిత్స అందించినప్పటికీ.. చిన్నారి పరిస్థితి విషమిం చింది. చివరకు చికిత్స పొందుతూ మానస మృతి చెందింది. ఇల్లంతా తిరుగుతూ అల్లరి చేస్తూ అందరిని నవ్వించే ఆ చిన్నారి... అంతలోనే ఈ లోకాన్ని విడిచి పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. ఊహించని ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నారి మృతితో ప్రగతి నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ ఘటనపై మైలార్దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

 

 

[ Hyderabad hot water accident, Mailardevpally news, Four year old girl dies, Telangana tragic incident, Water heater accident, Hyderabad toddler death, Telugu One, Telugu News ]
.