TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమ్మాయిల హాస్టల్ ముసుగులో ఫెర్టిలిటీ సెంటర్: గుట్టురట్టు చేసిన పోలీసులు.!

Published on: Sat Oct 31, 2026 8:14AM

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కే వ్యవహారం మరిచిపోక ముందే హైదరాబాద్ లో మరో అక్రమ ఫెర్టిలిటీ దందా వెలుగులోకి వచ్చింది.  .గరల్స్ హాస్టల్ ముసుగులో నిర్వహిస్తున్న అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. పక్కాగా అందిన సమాచారంతో హైదరాబాద్ ప్రకాశ్ నగర్ లో అమినీత గరల్స్ హాస్టల్ పై దాడి చేయడంలో అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ గుట్టు రట్లైంది.  పోలీసులు,  మల్కాజ్‌గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) సంయుక్తంగా ఈ ఆకస్మిక దాడిలో వెలుగు చూసిన అంశాలు అధికారులను విస్మయానికి గురి చేశాయి. 

గత ఏడాది కాలంగా ఈ ప్రాంగణాన్ని మహిళల వసతి గృహంగా మభ్యపెడుతూ ఈ అక్రమ కార్యకలాపాలను నిర్వాహకులు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా తదితర ఇతర రాష్ట్రాల నుంచి ఆర్థికంగా వెనుకబడిన యువతులను వివిధ కారణాలరీత్యా ఇక్కడికి రప్పించి, వారి నుంచి అండాలను అక్రమంగా సేకరిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

కేవలం మహిళా అండాల సేకరణ మాత్రమే కాకుండా, కొందరు పురుషుల నుంచి వీర్య నమూనాలను కూడా సేకరించి నగరంలోని వివిధ ఐవీఎఫ్ కేంద్రాలకు భారీ మొత్తాలకు విక్రయిస్తున్నట్లు ఈ తనిఖీలో బయటపడింది. నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని ఈ దందా నడుపుతున్నట్లు తెలిసింది.

ఈ సందర్భంగా బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన   10 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని సురక్షిత ప్రాంతానికి తరలించి  విచారిస్తున్నారు. ఈ దందాతో సంబంధం ఉన్న నిర్వాహకుల కదలికలపై అధికారులు నిఘా పెంచారు.. ఈ అక్రమ నెట్‌వర్క్ వెనుక ఏయే సంతాన సాఫల్య కేంద్రాలున్నాయి? దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగుతోంది.  


[Hyderabad Fertility Racket, Begumpet Girls Hostel Raid, Illegal Surrogacy Egg donation racket, Malkajgiri SOT police Operation, Telugu One]