TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇంతటి దారుణమా: భాగ్యనగరం.. మహిళల పాలిట అభాగ్య నగరం.!

Published on: Thu Oct 8, 2026 10:40AM

మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వg ఉన్నవాడు.. ఆధునిక వగ్గేయకారులు గోరటి వెంకన్న అన్న మాటలు అక్షర సత్యాలు అనిపిస్తుందీ ఉందంతం వింటే.. అభం శుభం తెలియని మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆ పై దారుణంగా హత్య చేశారు. ఆ నిర్మనుష్య ప్రదేశంలో ఆ మహిళ మృతదేహాన్ని కుక్కులు పీక్కు తిన్నాయి. హృదయాన్ని కలిచివేసి ఈ దారుణ ఘటన భాగ్యనగరంలో వెలుగు చూసింది.   హైదరాబాద్‌ శివారులోని తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.

గత నెల 28న ఇంట్లోంచి బయటకు వెళ్లిన మంగమ్మ తిరిగి రాలేదు. అయినా ఇంట్లో వారికి ఒకటే ఆశ.. ఇంట్లో వాళ్లకు ఒకటే ఆశ.. ఎక్కడో  ఉంది, తిరిగి వస్తుంది. ఆ ఆశతో ఉన్నవారికి మంగమ్మ తిరిగిరాని లోకాలకు వెళ్లిందన్న వార్త దుఖసాగరంలో ముంచేసింది.   సెప్టెంబర్ 28..మంగమ్మ కనిపించకుండా పోయిన రోజు. అదే రోజు ఆమె కుటుంబ సభ్యులు ఆమె మిస్సింగ్ అంటూ  ఓయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు తమకు తెలిసిన ప్రతి చోటా వెతికారు. బంధువులను అడిగారు. పరిచయస్తులను సంప్రదించారు. ఏక్కడో ఓ చోట  ఆమె క్షేమంగా ఉంటుందని ఆశించారు. అయితే వారి ఆశ అడియాస అయ్యింది.  

మంగమ్మపై దుండగులు అత్యాచారానికి పాల్పడి, అనంతరం హత్య చేసి మృతదేహాన్ని అక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అనుమానాలకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ ఆధారాలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా అసలు ఏం జరిగిందన్నది తేల్చే పనిలో ఉన్నారు.

ఒక మనిషి నిండు ప్రాణం పోవడం ఒకెత్తైతే.  ఆ తర్వాత జరిగిన పరిణామం మరింత కలచివేసేలా ఉంది. జీవించి ఉన్నప్పుడు ఒక కుటుంబానికి ఆధారంగా ఉన్న ఆమె..   మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటున్న దృశ్యం గుండెను ద్రవింప చేసింది. హృదయాన్ని కకావిలలు చేసింది. ఈ ఘటన విశ్వనగరం అని మనం గొప్పలు చెప్పుకునే భాగ్యనగరంలో మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒక మహిళ కనిపించకుండా పోయినప్పుడు వెంటనే స్పందించడం, ఆమె ఆచూకీ కోసం సమర్థవంతంగా గాలించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన గుర్తుచేస్తోంది. ఇక ఇప్పుడైనా దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానికులు, బాధిత కుటుంబం కోరుతున్నారు.   


[Hyderabad Crime, Death Women, Rape Murder, Nagole Police Station, Tatti Annaram,Telugu One]