రిక్రూట్ మెంంట్లలో ఇండియాలోనే ఫస్ట్: హైదరాబాద్ బెస్ట్.. టెక్, నాన్ టెక్ రంగాల్లో.!
Published on: Sat Oct 3, 2026 9:26AM

దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే ఉద్యోగాల నియామక ప్రక్రియలో హైదరాబాద్ బెస్ట్. ఈ విషయాన్ని ప్రముఖ సంఎంప్లాయిమెంట్ నివేదిక నివేదిక వెల్లడించింది. వివిధ రంగాల్లో కొత్త కొలువుల భర్తీ వేగవంతం కావడం, కార్పొరేట్ కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలను విస్తరించడం ఇందుకు కారణంగా ఆ నివేదిక పేర్కొంది. దేశంలోని ఇతర మహానగరాలతో పోలిస్తే టెక్ మరియు నాన్-టెక్ రంగాలకు సంబంధించి ఆఫీసు రిక్రూట్ మెంట్లలో దేశంలోనే హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

నిరుద్యోగ యువత, ఉద్యోగార్థులకు నగరంలో లభిస్తున్న అవకాశాలపై వెలువడిన ఈ నివేదిక ప్రకారం, వివిధ రంగాల్లో నిపుణులైన అభ్యర్థుల కోసం కంపెనీలు పోటీపడుతున్నాయి. దీంతో రిక్రూట్ మెంట్ కార్యకలాపాలు భాగ్యనగరంలో జోరందుకున్నాయి. గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది.

దేశంలోని ప్రతిష్టాత్మక జాబ్ మార్కెట్ ట్రెండ్స్‌ను విశ్లేషిస్తూ వెలువడిన ఈ నివేదిక మేరకు, . కంపెనీలు కొత్త ఉద్యోగులను చేర్చుకునే విషయంలో హైదరాబాద్‌ను ప్రథమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయి. స్థానిక ఉపాధి మార్కెట్ స్థిరంగా వృద్ధి చెందుతుండటం, మౌలిక వసతులు అభివృద్ధి చెందుతుండటంతో ప్రముఖ సంస్థలు ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి.

ఈ సానుకూల పరిణామాల వెనుక స్థానిక ఆర్థిక వాతావరణం, ప్రభుత్వ విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత దోహదం చేస్తున్నాయి. విదేశీ సంస్థలతో పాటు దేశీయ దిగ్గజ కంపెనీలు కూడా హైదరాబాద్ నగరంలో కార్యకలాపాలను విస్తరిస్తూ భారీగా రిక్రూట్ మెంట్లు చేపడుతున్నాయి. కేవలం ఐటీ రంగమే కాకుండా నాన్ టెక్ రంగాల్లోనూ కర్యాలయాలలో ఉద్యోగాల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఉపాధి కల్పన మరింత ఊపందుకునే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
[Hyderabad Appointments, Job Market Trends, Corporate Hiring Hyderabad, Employment, Telugu One]


