TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దేశంలో రెండో ఖరీదైన మెట్రో సిటీ హైదరాబాద్: పెరిగిన ధరలు, తగ్గిన విక్రయాలు.. కారణాలేంటి.?

Published on: Tue Nov 24, 2026 2:53PM

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజా గణాంకాల ప్రకారం, ఢిల్లీ తర్వాత దేశంలోనే రెండో అత్యంత ఖరీదైన మెట్రో నగరంగా హైదరాబాద్ నిలిచింది. నగరంలో నివాస గృహాల ధరలు గణనీయంగా పెరగడంతో సామాన్య, మధ్యతరగతి కొనుగోలుదారులపై భారం పెరుగుతోంది. క్రెడాయ్  విడుదల చేసిన నివేదిక వివరాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో  హైదరాబాద్‌లో సగటు గృహాల ధరలు వార్షిక ప్రాతిపదికన 10.5 శాతం వృద్ధి చెంది రూ.2.15 కోట్లకు చేరుకున్నాయి. 

ఏడాది వ్యవధిలో సగటు ధరపై అదనంగా రూ.21 లక్షల మేర పెరుగుదల నమోదవడం మామూలు విషయం కాదు. అయితే,  ఇటు  ప్రాపర్టీ రేట్లు భారీగా పెరుగుతుండగా, అటు ఇళ్ల విక్రయాల సంఖ్యలో అదే స్థాయిలో తగ్గుదల కనిపించింది. ఇదే త్రైమాసికంలో నగరంలో గృహ అమ్మకాలు 13.5 శాతం క్షీణించి 13,270 యూనిట్లకు పరిమితమయ్యాయి. పెరిగిన ధరలే కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఆస్తుల ధరలు ఇంతలా ఎగబాకడానికి పలు కారణాలున్నాయి. భూముల ధరల పెరుగుదల, నిర్మాణ వ్యయం అధికమవడం, రుణాలపై వడ్డీ ఖర్చులు పెరగడం వంటి అంశాలు ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచుతున్నాయి. వీటితో పాటు నిర్మాణ రంగంలో కార్మికుల కొరత కూడా ధరల పెరుగుదలకు దోహదపడుతోందని నిపుణులు అంటున్నారు. 

మరో కీలక అంశంగా నగరంలో అమలులో ఉన్న సరళతర ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్   నిబంధనలను పరిశీలకులు చెబుతున్నారు.   హైదరాబాద్‌లో ఎఫ్ఎస్ఐపై గరిష్ఠ పరిమితి లేకపోవడం వల్ల నిర్మాణ సంస్థలు విశాలమైన, పెద్ద సైజు అపార్ట్‌మెంట్లను నిర్మించేందుకు వీలు కలుగుతోంది. విస్తీర్ణం పెద్దదిగా ఉండటంతో సహజంగానే మొత్తం ప్రాపర్టీ ధరలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అధిక విస్తీర్ణం కలిగిన ప్రీమియం గృహాల నిర్మాణం పెరగడం నగర సగటు ధరలను పైకి తీసుకెళ్లిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో, అందుబాటు ధరల గృహాల (  లభ్యత తగ్గడం వల్ల విక్రయాల పరిమాణంలో తగ్గుదల నమోదౌతోంది.

ఇది కూడా చదవండి:  హైదరాబాద్ లో రియల్ సంక్షోభం: నిర్మాణాలు వేగం.. కొనుగోళ్లు దాదాపు శూన్యం.!

రానున్న త్రైమాసికాల్లో నిర్మాణ వ్యయం, రుణ రేట్లు, డెవలపర్ల కొత్త ప్రాజెక్టుల ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయనే దానిపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించాయి. ముఖ్యంగా మధ్యతరగతి కొనుగోలుదారులకు అనుకూలమైన విభాగాల్లో సరఫరా పెరిగితే విక్రయాలు మళ్లీ పుంజుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

మొత్తంగా చూస్తే..  హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ధరల పెరుగుదల   నగర వృద్ధిని సూచిస్తుండగా, అదే సమయంలో   విక్రయాల తగ్గుదల కొనుగోలుదారుల సామర్థ్యంపై ప్రభావాన్ని చూపుతోంది. రాబోయే కాలంలో ధరల స్థిరత్వం, మార్కెట్ సమతుల్యత ఎలా ఉంటుందన్న విషయంలో పరిశీలకులు భిన్న విశ్లేషణలు చేస్తున్నారు.

మీకు నచ్చవచ్చు:  నష్టాల ఊబిలో హైదరాబాద్ మెట్రో.. ఆరు నెలల్లోరూ.405 కోట్లు.. రెండో దశ విస్తరణపై నీలినీడలు.?

దేశంలోనే నంబర్ వన్ హైదరాబాద్!​

[Hyderabad, Second Richiest, Metrocity,  Real Estate, Housing Prices, CREDAI Report, TeluguOne]