హైదరాబాద్ లో సీప్లేన్లు.. హుస్సేన్ సాగర్ జలాలలో ల్యాండిగ్.. టేకాఫ్.!
Published on: Thu Sep 3, 2026 11:42AM

విశ్వనగరం హైదరాబాద్ సరికొత్త పర్యాటక శోభను సంతరించుకోనుంది. సముద్రం లేని రాష్ట్రంలో సీప్లేన్ సర్వీసులు అందుబాటులోనికి రానున్నాయి. ఈ మేరకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ లో సీ-ప్లేన్ సర్వీసులను ప్రారంభించే ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో విమానయాన రంగాన్ని విస్తరించడంతో పాటు పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఈ ప్రతిపాదనపై కసరత్తు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖతో సంప్రదింపులు పూర్తి చేసింది.
ఇటీవలి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో భేటీ అయ్యారు. ఆ భేటీలో తెలంగాణలో విమానయానాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. అందులో భాగంగానే హుస్సేన్ సాగర్‌లో సీ-ప్లేన్ ఆపరేషన్లకు సంబంధించి రేవంత్ రెడ్డి కింజరాపు రామ్మెహన్ నాయుడితో చర్చించి, తమ ప్రతిపాదనకు ఓకే చెప్పాల్సిందిగా కోరారు.

అందుకు కేంద్రమంత్రి కింజరాపు సానుకూలంగా స్పందించారు. రేవంత్ తో భేటీలో వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు సంబంధించిన కాలపరిమితిని సమీక్షించామని కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అలాగే.. హుస్సేన్ సాగర్ నీటిపై సీ-ప్లేన్ల ల్యాండింగ్, టేకాఫ్ ఆపరేషన్లను ప్రారంభించే అంశంపై కూడా చర్చ జరిగిందన్నారు.
[Hussain Sagar seaplane operations, Revanth Reddy Rammohan Naidu meeting, Hyderabad tourism updates, Telangana aviation projects, Hussain Sagar lake attractions]


