TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఆదిలాబాద్ జిల్లాలో పరువు హత్య: కన్న కూతురినే కడతేర్చిన తండ్రి.!

Published on: Thu Nov 26, 2026 3:10PM

ఆదిలాబాద్ జిల్లాలో పరువు హత్య కలకలంరేపింది. పరువుపోతుందన్న భయంతో కన్నతండ్రే తన కుమార్తె ప్రాణాలు తీసిన విషాద ఘటన   నార్నూర్ మండల పరిధిలోని ఉమ్రి గ్రామంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.   ఉమ్రి గ్రామానికి చెందిన కైలాస్ తన కుమార్తె కళ్యాణి ప్రేమ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఈ విషయం బయటకు తెలిస్తే గ్రామంలో   కుటుంబ పరువు పోతుందన్న భయంతో  తన కన్నబిడ్డ 18 ఏళ్ల కళ్యాణిని హత్య చేశాడు.  అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, మృతదేహాన్ని ఇంటిలోని మరో గదిలోకి తీసుకెళ్లి ఉరివేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా  నమ్మించే ప్రయత్నం చేశాడు.  

అయితే మృతదేహాన్ని హడావుడిగా దహనం చేయడం, పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందించారు.  దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కైలాస్ ను విచారించగా అసలు నిజం బయటపడింది.  కుమార్తె ప్రేమ వ్యవహారం వల్ల పరువు పోతుందన్న కారణంతో తానే హత్య చేసినట్లు కైలాస్ విచారణలో అంగీకరించాడు. 

ఒకవైపు అల్లారుముద్దుగా పెంచుకున్న  కుమార్తెను హత్య చేసి,  ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేసినట్లుగా ఒప్పుకున్నాడు.  దీంతో పోలీసులు కైలాస్ ను అదుపులోనికి తీసుకున్నారు.  ఘటనాస్థలిలో సాక్ష్యాల సేకరణ, సాక్షుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియ చేపట్టారు.  


[Honor killing,  in Adilabad,   murder case,   Father Murder, Daughter, TeluguOne]