TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హోంమంత్రి అనిత చేతికి గాయం.. ఏం జరిగిందంటే?

Published on: Mon Aug 24, 2026 1:15PM

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతి   వేదికగా  అమరావతి ఛాంపియన్‌షిప్‌   పోటీలు సోమవారం (ఆగస్టు 24) ఘనంగా ఆరంభమయ్యాయి.  అయితే ఈ వేడుక సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి అనిత స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి అనిత ప్రసంగిస్తుండగా,   కార్యక్రమం కవరేజ్ కోసంఉపయోగించిన డ్రోన్లలో  ఓ డ్రోన్ బ్యాటరీ   ఛార్జింగ్   తగ్గిపోవడంతో   అదుపు తప్పి కిందకు పడిపోతున్న సమయంలో  డ్రోన్ నుండి ఊడిపోయిన బరువైన బ్యాటరీ నేరుగా వేదికపై ఉన్న   అనిత గారి కుడిచేతిపై  పడింది.   వెంటనే ఆమెకు అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేశారు. చేతికి బ్యాండేజ్ వేశారు.     

గాయం నొప్పి తీవ్రంగా ఉన్నప్పటికీ   అనిత తన ప్రసంగం కొనసాగించారు.   అయితే, వీఐపీలు ఉండే వేదికల వద్ద  డ్రోన్ల వినియోగం,  సాంకేతిక భద్రతపై ఈ సంఘటన ప్రశ్నలకు తావిచ్చింది.   ప్రమాదానికి కారణమైన డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇది  సాంకేతిక లోపం వల్ల జరిగిన ప్రమాదమా..   ర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. 

Home Minister Vangalapudi Anitha Injured, Tirupati Drone Battery Incident, Amaravati Championship,   Andhra Pradesh News, TeluguOne