TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భక్త జన సంద్రంగా తిరుమల.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు.!

Published on: Sat Sep 5, 2026 9:54AM

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉండే తిరుల క్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. వారాంతం కావడంతో దేశ  ఆధ్యాత్మిక రాజధాని తిరుమల భక్త జనకోటితో కిటకిటలాడుతోంది.  దేశం నలుమూలల నుంచి, అలాగే విదేశాల నుంచీ శ్రీవారి దర్శనం కోసం యాత్రికులు భారీ సంఖ్యలో  తరలి వస్తున్నారు. దీంతో శనివారం (సెప్టెంబర్ 5) వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయి.. భక్తుల క్యూలైన్లు   వెలుపలికి విస్తరించాయి.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి  సర్వదర్శనం లభించడానికి 20 గంటలకుపైగా సమయం పడుతోంది.  

 రద్దీ అధికంగా ఉన్నప్పటికీ భక్తులకు  ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  టీటీడీ చర్యలు తీసుకుంటోంది.  క్యూలైన్లలో   వేచి ఉన్న భక్తులకు  టీటీడీ సిబ్బంది నిరంతరం పాలు, తాగునీరు, అల్పాహారం, అన్నప్రసాదం అందిస్తున్నారు.  ఇక పోతే శుక్రవారం (సెప్టెంబర్ 4) శ్రీవారిని మొత్తం  68 వేల 374 మంది దర్శించుకున్నారు.  వారిలో 35 వేల 241 మంది   తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 3 లక్షల రూపాయలు వచ్చింది.  


[Heavy Rush in Tirumala, Darshan time,TTD News, vaikuntam queue complex, Tirumala crowds, Lord Venkateswara Temple, Telugu One]