అర్నాబ్ ఎఫెక్ట్: కుండపోత, కుంభవృష్టి.. రాకాసి అలలు, పెనుగాలులు.!
Published on: Tue Oct 27, 2026 11:09AM

అర్నాబ్ పెను తుపాను కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో సంభవించే తుపానులు అపారనష్టం కలిగిస్తాయి. గతంలో సంభవించిన తుపానులను గుర్తు చేసుకుంటూ తీరప్రాంత వాసులు బెంబేలెత్తిపోతున్నారు. అర్నాబ్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో ఇప్పటికే అల్లకల్లోల వాతావరణం నెలకొంది. సముద్రంఅల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు పోటెత్తుతున్నాయి. పెను గాలులు భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.
.webp)
భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, అర్నాబ్ తీరం దాటే సమయంలో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలుల ప్రభావంతో సముద్ర అలలు చెలియలకట్ట దాడి వస్తాయన్న ఆందోళన తీర ప్రాంత వాసులలో వ్యక్తమౌతోంది. దివిసీమ, కోససీమ ఉప్పెనలను గుర్తు చేసుకుంటూ భయాందోళనలకు గురౌతున్నారు. బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో అర్నాబ్ తుపాను తీరం దాటే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి.
ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక శాఖలను, అధికారులను అప్రమత్తం చేసింది. తీర ప్రాంత జిల్లాలలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, పునరావస కేంద్రాలను సిద్ధం చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలావుంటే, ఈ తుపాను ఉద్ధృతి కారణంగా రవాణా వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ముందు జాగ్రత్త చర్యగా రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. విమానాశ్రయాల్లోనూ అధికారుల పర్యవేక్షణ పెరిగింది. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేస్తూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఇప్పటికే న్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తుపాను ప్రభావిత ప్రాంతాలలో మోహరించింది. ఆస్తినష్టం, ప్రాణనష్టాన్ని వీలైనంత వరకు తగ్గంచడమే లక్ష్యంగా యంత్రాగం సర్వసన్నద్ధంగా ఉంది.
[Heavy Rains Supertides Shewer Cost Andhra, , Cyclone Arnab Andhra Pradesh, AP Cyclone High Alert, Telugu One]


