TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన.!

Published on: Mon Aug 31, 2026 9:52AM

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.  పశ్చిమ బెంగాల్ పరిసరాల్లోని బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితలంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ సమాచారం మేరరు రానున్న నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.  ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

విశేషంగా ఉత్తర, తూర్పు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయి. భారీ వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉండటంతో..  పాత భవనాలు, చెట్లు  కూలిపోయే అవకాశాలున్నాయని హెచ్చరించింది.  

ఇక హైదరాబాద్ వ్యాప్తంగా ఆదివారం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని పూర్కొన్న హైదరాబాద్ వాతావరణ శాఖ  హెచ్చరికలతో  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ , అత్యవసర విభాగాలూ అప్రమత్తమయ్యాయి.  ఈ వానలు వ్యవసాయానికి మేలు చేస్తాయని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది.   

{Heavy Rains in Telangana, Telangana Rains,  Weather Alert, Yellow Alert,   Bay of Bengal Low Pressure,   Heavy Rain Forecast Telangana}