తెలంగాణలో సూర్య ప్రతాపం: వానా కాలంలో వేసవి.. శీతాకాలంలో రోహిణీకార్తె.!
Published on: Fri Oct 9, 2026 2:55PM

తెలంగాణలో అక్టోబర్ నెలలోనూ ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాల ప్రభావం తగ్గి వర్షాలు తగ్గుముఖం పట్టగానే శీతాకాలం ఆగమనం ప్రారంభమౌతుంది. అయితే ఈ సారి ఎల్ నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఇక శీతాకాలం ఆగమనం సంగతి అటుంచి.. మళ్లీ వేసవి మొదలైందా అన్నట్లుగా ఎండలు దంచి కొడుతున్నాయి.
పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉక్కపోత, ఎండ వేడిమితో జనం ఇబ్బందులు ెదుర్కొంటున్నారు. అసాధారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలను తలపిస్తూ 36 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకూనమోదౌతున్నాయి. ఇక హైదరాబాద్‌లోనూ పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల దాటి నమోదౌతోంది. దీంతో రాష్ట్ర ప్రజలు వేడి, ఉక్కపోతతో సతమతమౌతూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు. ఈ వాతావరణ మార్పు ప్రజారోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు.
[Heat Wave Alert Telangana, Telangana heat, Weather Alert, Hyderabad Temperatures, Meteorological Department Warning, , October Summer, Telugu One]


