TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కోతిబంధించి, ఊరేగించి సంబరాలు చేసుకున్నారు: ఇంతకీ ఆ మర్కటం ఏం చేసిందంటే.?

Published on: Fri Oct 23, 2026 11:57AM

ఓ కోతి తలపై 51 వేల రూపాలయ రివార్డును ఉంది. స్థానికులు ఆ కోతి కారణంగా గత కొన్ని రోజులుగా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఎట్టకేలకు గురువారం (అక్టోబర్ 23) ఆ మర్కటం పట్టుబడటంతో దానిని బంధించి పట్టణ వీధుల్లో ఊరేగించి మరీ సంబరాలు జరుపుకున్నారు.

 ఈ సంఘటన హర్యానాలోని హథీన్ పట్టణంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. హధీన్ పట్టణంలో గత కొద్ది రోజులుగా ఓ మర్కటం వీరవిహారం చేస్తోంది. కనిపించిన వారిని కనిపించినట్లు కరిచి గాయపరుస్తోంది. కొద్ది రోజుల వ్యవధిలోనే  ఆ కోతి ఏకంగా 30 మందిని కరిచి గాయపరిచింది. దీంతో ఇంట్లోంచి అడుగు బయటపెట్టాలంటేనే పట్టణవాసులు భయపడే పరిస్థితికి వచ్చారు. 

దీంతో వారు  మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కోతి కారణంగా గాయపడిన వారిని పరామర్శాంచిన మునిసిపల్ చైర్ పర్సన్.. ఆ కోతిని బంధించిన వారికి తన సొంత నిధుల నుంచి 51 వేల రూపాయలు రివార్డు ఇస్తానని ప్రకటించారు.  ఆ కోతిని స్థానికుడొకరు గురువారం (అక్టోబర్ 23) బంధించగలిగాడు.

బంధించిన కోతి చేతులు, కాళ్లూ కట్టేసి స్థానికులు పట్టణ వీధుల్లో దానిని ఊరేగించి సంబరాలు చేసుకున్నారు.  ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోతిని బంధించడం, హింసించడంపై కొందరు నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా రోజుల తరబడి తమకు కంటిమీద కునుకు లేకుండా చేసిన కోతి ఎట్టకేలకు బంధించడంతో హధీన్ వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. 


[Haryanas Most Wwanted Monkey Caught, Reward Monkey Head, Hathin People Celebrate, Telugu One]