హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో ప్రారంభ‌మైన సీఎం రేవంత్ త‌ర‌గ‌తులు

posted on: Jan 26, 2026 8:10PM

 

అమెరికాలోని ప్ర‌ఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెనెడీ స్కూల్‌లో (కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్) ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. తొలి రోజు ప‌రిచ‌య కార్య‌క్ర‌మాల‌తో పాటు  21వ శ‌తాబ్దంలో నాయ‌క‌త్వం  కోర్సులో భాగంగా “అధికార విశ్లేషణ.. నాయకత్వం” అంశంపై తొలి సెషన్‌ ప్రారంభమైంది. సోమ‌వారం ఉదయం 7 గంటల నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి. ఇందులో  కేస్ అనాలిసిస్, వివిధ అంశాలపై తరగతులు, కన్సల్టేటివ్ గ్రూప్ వర్క్ వంటి కార్యక్రమాల్లో సభ్యులు పాల్గొన్నారు.

సోమ‌వారం సాయంత్రం ఆరు గంట‌ల  వ‌ర‌కు (స్థానిక కాల‌మానం ప్ర‌కారం...) తరగతులు కొనసాగనున్నాయి. మ‌రోవైపు  బోస్టన్ ప్రాంతమంతా తీవ్ర శీతాకాల అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి.  భారీ మంచు తుఫాను (ఫెర్న్‌) కారణంగా రెండు అడుగులకుపైగా (సుమారు 24 ఇంచులు) మంచు కురిసినట్లు సమాచారం. ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీల సెల్సియస్‌కి దిగువకు పడిపోయాయి. 


 

google-ad-img
    Related Sigment News
    • Loading...