కనీసం ఒక్క ఫార్మట్ కైనా కెప్టెన్సీ: బీసీసీఐ ఆఫర్ కు హర్మన్ ప్రీత్ కౌర్ నో.!
Published on: Wed Oct 7, 2026 8:53AM
.webp)
ఉరుములేని పిడుగులా టీమ్ ఇండియా మహిళల జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి హర్మన్ ప్రీత్ కౌర్ వైదొలగడం సంచలనంగా మారింది. దశాబ్దం పాటు జట్టుకు సారథిగా హర్మన్ ప్రీత్ కౌర్ హఠాత్తుగా మూడు ఫార్మాట్ ల కెప్టెన్సీ నుంచీ వైదొలిగింది. బీసీసీఐ ఆమెను కనీసం ఒక ఫార్మట్ కైనా కెప్టెన్ గా ఉండాల్సిందగా కోరినప్పటికీ ఆమె నిర్ద్వంద్వంగా నిరాకరించినట్లు సమాచారం.
ప్రధానంగా వన్డే మహిళల జట్టు సారథిగా కొనసాగాలని బీసీసీఐ ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. అయితే అందుకు ససేమిరా అన్న హర్మన్ ప్రీత్ కౌర్ జట్టు సభ్యురాలిగా మాత్రమే కొనసాగుతాననీ, స్కిప్పర్ గా ఉండే ప్రశక్తే లేదనీ కరాఖండీగా చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా కెప్టెన్స్ ఒత్తిడి ప్రభావం తన బ్యాటింగ్ పై బలంగా పడుతోందనీ, స్వేచ్ఛగా తన సహజశైలిలో బ్యాటింగ్ చేయలేకపోతున్నాననీ పేర్కొన్న హర్మన్ ప్రీత్ కౌర్.. ఇక నుంచి తాను తన బ్యాటింగ్ ను ఆస్వాదీస్తూ మునుపటి అగ్రసివ్ ఫామ్ ను అందుకోవాలని భావిస్తున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది.

తాను కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఎన్నో జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాలతో కూడిన ఈ నిర్ణయం సులభంగా తీసుకున్నది కాదని పేర్కొన్న హర్మన్ ప్రీత్ సింగ్.. భారత మహిళల క్రికెట్‌కు నాయకత్వం వహించే అవకాశం తనకు లభించడం గర్వకారణమని తెలిపింది. ఇకపై కెప్టెన్‌గా కాకుండా ఇక నుంచీ జట్టులో ప్లేయర్ గా కొనసాగుతానని పేర్కొంది.
హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలో భారత మహిళల జట్టు పలు కీలక విజయాలు అందుకుంది. 2025లో భారత జట్టు తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకోవడం, ఇటీవల ఏషియన్ గేమ్స్‌లోనూ స్వర్ణ పతకం సాధించడం ఆమె నాయకత్వంలోనే జరిగింది.
ఇక హర్మన్‌ప్రీత్ స్థానంలో స్మృతి మంధానకు భారత మహిళల జట్టు పూర్తి స్థాయి వైట్‌బాల్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. స్మృతి ఇప్పటికే 18 టీ20లు, నాలుగు వన్డేలకు భారత్‌కు నాయకత్వం వహించారు. దేశవాళీ, ఫ్రాంచైజీ క్రికెట్‌లోనూ నాయకత్వ అనుభవం ఉన్న ఆమె.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును మహిళల ప్రీమియర్ లీగ్‌లో రెండు టైటిళ్లకు నడిపించారు.
.webp)
కొత్త కెప్టెన్ స్మతి నాయకత్వంలో అక్టోబర్ 16 నుంచి జింబాబ్వేతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌తో స్మృతి పూర్తి స్థాయి మరోవైపు హర్మన్‌ప్రీత్ కూడా జట్టులో కొనసాగనున్నారు. దీంతో ఒకవైపు కొత్త నాయకత్వం.. మరోవైపు అనుభవజ్ఞురాలైన మాజీ కెప్టెన్ సేవలు కొనసాగడం భారత మహిళల జట్టుకు కలిసివస్తుందని క్రీడా పండితులు అంటున్నారు.
[Harmanpreet Kaur, BCCI, Smriti Mandhana, Indian Women Cricket, Harmanpreet captaincy, women cricket captain, BCCI offer, Reject, Telugu One]


