Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హార్వర్డ్ వెళ్ళినా...అంతరిక్షం వెళ్ళినా నీ తీరు మారదు : హరీష్ రావు
posted on: Feb 2, 2026 7:50PM
.webp)
హైదరాబాద్‌లో జరిగిన రావి నారాయణ రెడ్డి జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి హేట్ స్పీచ్‌పై హిత బోధ చేసిన కొద్ది నిమిషాలు కూడా గడవకముందే, అదే వేదికపై రేవంత్ రెడ్డి తన అసలు స్వభావాన్ని, తన మాటల ద్వారానే బయటపెట్టుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు ధ్వజమెత్తారు. హేట్ స్పీచ్‌పై ఉపన్యాసం ముగియకముందే, రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్‌కు లైవ్ డెమో ఇచ్చారు.
మాజీ సీఎం కేసీఆర్‌పై కడుపులో కత్తులు, నోటిలో విషం పెట్టుకున్న రేవంత్ రెడ్డి తన అజీర్తిని, అక్కసును మరోసారి బయటపెట్టారని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్‌పై కడుపులో కత్తులు, నోటిలో విషం పెట్టుకున్న రేవంత్ రెడ్డి తన అజీర్తిని, అక్కసును మరోసారి బయటపెట్టారని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హేట్ స్పీచ్ అంటే ఏమిటో చెప్పడానికి పుస్తకాలు అవసరం లేదు.. రేవంత్ రెడ్డి ప్రసంగాలు చాలని హితవు పలికారు.
అమెరికా వెళ్లి హార్వర్డ్ లో నాలుగు రోజులు చదువుకున్నా.. రేవంత్ రెడ్డి తన వెనకటి గుణం మాత్రం మార్చుకోలేదని హరీష్ రావు అన్నారు. కనీస సంస్కారం రాలేదు, చిల్లర మాటల్లో, వెకిలి చేతల్లో ఎలాంటి మార్పు రాలేదని తెలిపారు. దేశానికి గాంధీ జాతిపిత అయినట్లే, తెలంగాణను సాధించిన కేసీఆర్ జాతి పితనే ఆయన అన్నారు. నాలుగు కోట్ల ప్రజలు ఏకమై స్వరాష్ట్రం కోసం కొట్లాడుతుంటే ఆంధ్రా పాలకుల బూట్లు తుడుస్తున్న నీకు కేసీఆర్ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి ఎలా తెలుస్తుందని విమర్శించారు.
ఉద్యమకారులపైకి తుపాకి ఎక్కుపెట్టిన నీకు ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు ఉందా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే, నిలదీస్తే అరెస్టులు, కేసులతో నిరంకుశంగా వ్యవహరిస్తున్న నీకు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు ఉందా అన్నారు. లక్కీ లాటరీలో ముఖ్యమంత్రి అయిన నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఎలా అర్థం అవుతాయిని హరీష్ రావు ప్రశ్నించారు.






