Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన హరీష్ రావు
posted on: Feb 9, 2026 3:03PM
.webp)
సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాలు తిరుగుతున్నప్పటికీ, మెదక్ జిల్లాకు మాత్రం రాలేకపోతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. హరీష్ రావు ఆరోపించారు. మెదక్ జిల్లాలో తాను ఉన్నందువల్లే రేవంత్ రెడ్డి భయపడుతు న్నారని వ్యాఖ్యానించారు. మెదక్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో హరీష్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నా రని, పోలీసులను అడ్డుపె ట్టుకుని రాజకీయ దౌర్జన్యా నికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా పోలీసులకు కూడా హరీష్ రావు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు... పోలీసుల తీరుపై హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అధికార పార్టీ ఆదేశాలతో పనిచేస్తూ ఎక్స్ట్రాలు చేస్తున్న అధికారుల పట్ల భవిష్యత్తులో కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. “మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం… మంచికి మంచి ఇస్తాం. కానీ హద్దులు దాటితే దేనికైనా సిద్ధం. ఖబడ్దార్” అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరిం చారు.
ఎక్స్‌ట్రాలు చేసిన ప్రతి ఒక్కరి నట్లు, బోల్టులు ఫిట్ చేస్తానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది. రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేసిన హరీష్ రావు, ఆ సమయంలో తానే మళ్లీ మంత్రిగా ఉంటానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమని స్తున్నారని, రాబోయే ఎన్నిక ల్లో తగిన గుణపాఠం చెబు తారని అన్నారు.
ప్రతిపక్షం నేతలపై అక్రమ కేసులు రాజకీయ ఒత్తులతో పోలీసులు పనిచేస్తున్నారు అంటూ హరీష్ రావు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ తటస్థంగా ఉండాలని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో బాధ్యత తప్పదని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం వ్యక్తం చేశారు.మెదక్ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరింత వేడి పెంచాయి.


.webp)



