సెప్టెంబర్ 13 నుంచి భారత్ vs అఫ్గానిస్థాన్ టీ20లు: హార్దిక్ ఆడటం కష్టమేనా?
Published on: Tue Sep 1, 2026 11:50AM
(2).webp)
భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అభిమానులకు మళ్లీ తీరని నిరాశ ఎదురైంది. గాయం నుంచి కోలుకుని అంతర్జాతీయ క్రికెట్ లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న ఈ డాషింగ్ ప్లేయర్ కు మరోసారి భారీ షాక్ తగిలింది. సుదీర్ఘ విరామం తర్వాత ప్రాక్టీస్ లో తీవ్రంగా శ్రమిస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యాకు తాజాగా మళ్లీ కొత్తగా గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెలలో అఫ్గానిస్థాన్‌తో జరగనున్న ప్రతిష్టాత్మక 3 మ్యాచ్ ల టీ20 సిరీస్‌కు అతడు దూరం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తొడ కండరాల గాయంతో బాధపడిన హార్దిక్ పాండ్యా గత కొన్ని నెలలుగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) లో కఠినమైన పునరావాసంలో ఉన్న సంగతి తెలిసిందే. ఎంతో శ్రమించి గాయం నుంచి తేరుకోవడమే కాకుండా, ఇటీవలే పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించాడని సీఓఈ వర్గాలు స్పష్టం చేయడంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి.
రాబోయే అఫ్గాన్ టీ20 సిరీస్ ద్వారా హార్దిక్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టి తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో అలరిస్తాడని అంతా భావించారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం, నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా ఆయన కాలికి అనూహ్యంగా మరో గాయమైంది. ఈ ఘటనతో పాండ్యా రీ ఎంట్రీ కలలకు తీవ్ర విఘాతం కలిగింది. చివరగా భారత్ తరఫున 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో ఆడిన హార్దిక్, ఆ తర్వాత నుండి మైదానానికి దూరంగానే ఉండిపోయాడు. ఇప్పుడు మళ్లీ కొత్తగా గాయపడటంతో సెలెక్టర్లు సైతం ఆలోచనలో పడ్డారు. అఫ్గానిస్థాన్‌తో జరగబోయే కీలక టీ20 సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు ఈ వారంలోనే భారత జట్టును అధికారికంగా ఎంపిక చేయనున్నారు. ఈ తరుణంలో హార్దిక్ ఫిట్‌నెస్ సాధించకపోవడం మేనేజ్మెంట్ ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
hardik pandya injured again afghanistan series,ind vs afg t20 series hardik pandya doubtful.


