TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హనుమకొండలో పెను ప్రమాదం.. విద్యుత్ తీగలు చుట్టుకుని ఆర్టీసీ బస్సు బీభత్సం..!

Published on: Tue Sep 15, 2026 1:20PM

 

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నేలకూలిన చెట్టు, ధ్వంసమైన వాహనాలు..!

హనుమకొండ నడిబొడ్డున జరిగిన ఒక ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ బాధ్యతారహిత్యంగా, అతివేగంగా బస్సును నడపడంతో ఒక పెద్ద ప్రమాదమే సంభవించింది. పబ్లిక్ గార్డెన్ మూలమలుపు వద్ద బస్సు వేగంగా తిరగడంతో అక్కడే ఉన్న విద్యుత్ తీగలు బస్సుకు చుట్టుకున్నాయి. ఆ వేగానికి తీగలు ఆనుకుని ఉన్న భారీ వృక్షం ఒక్కసారిగా నేలకూలింది. ఈ హఠాత్పరిణామంతో అక్కడ నిలిపి ఉంచిన రెండు ఆటోలు, రెండు బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. కానీ, ఆ సంఘటన స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో ఒక్క క్షణం తేడా వచ్చినా వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ ఘటనతో ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారిగా హడలిపోయారు. "మేము బతికి బయటపడ్డామంటే అది మా అదృష్టమే" అంటూ స్థానికులు కన్నీటి పర్యమంతమయ్యారు. ఈ ప్రమాదం కేవలం వాహనాల ధ్వంసంతో ఆగలేదు. అక్కడ రాగిజావ అమ్ముకుంటూ జీవనం సాగించే ఒక నిరుపేద ఉపాధిని పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఎన్నో ఆశలతో, రోజువారీ కష్టాన్ని నమ్ముకుని బండి పెట్టుకుని వ్యాపారం చేసుకునే అతనికి ఈ ప్రమాదం కోలుకోలేని దెబ్బ తగిలింది. 

"నా బండి పూర్తిగా ధ్వంసమైంది, కనీసం యాభై వేల పైనే నష్టం వచ్చింది. ఈ బండి మీదనే మా కుటుంబం ఆధారపడి ఉంది. ప్రభుత్వం స్పందించి నాకు న్యాయం చేయాలి" అంటూ ఆ బాధితుడు రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. ఒక డ్రైవర్ చేసిన చిన్న నిర్లక్ష్యం ఒక నిరుపేద కుటుంబం నోటి కూడును ఎలా లాగేసుకుందో ఈ ఘటన కళ్ళకు కడుతోంది.సకాలంలో ట్రాఫిక్ పోలీసులు స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చినప్పటికీ, ఆర్టీసీ డ్రైవర్ల బాధ్యతా రహిత్య ధోరణిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి ఘటనలపై రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు తక్షణ ఆర్థిక సాయం అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 

 

 

[ Hanamkonda RTC bus incident, RTC bus accident Telangana, Hanamkonda public garden accident, Sircilla depot bus news, RTC driver negligence, Hanamkonda electric wires bus accident, 
Warangal local news updates, RTC bus crash Hanamkonda today, TGRTC, CM Revanth reddy, Minister ponnam prabhakar ]