TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇండియన్ టెక్కీలకు మరో షాక్.!?

Published on: Tue Sep 1, 2026 9:20AM

అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిన ఇండియన్ టెక్కీలు మరీ ముఖ్యంగా  వారి కుటుంబాలకు షాకింగ్ నిర్ణయం దిశగా అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తున్నారా? అంటే తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి ఔననే అనాల్సి వస్తున్నది.  హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలపై అమెరికా ప్రభుత్వం కొరడా ఝుళిపించేందుకు సిద్ధమౌతోంది. హెచ్ 4 వీసా  ఉన్న డిపెండెంట్లకు ఇచ్చే ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) అనుమతులను రద్దు చేసే దిశగా ట్రంప్ సర్కార్ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నది. 

ఈ ప్రతిపాదనను అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ  తన అధికారిక నియంత్రణ ఎజెండాలో   చేర్చింది.  హెచ్-4 డిపెండెంట్ స్పౌసెస్ ఫ్రమ్ ది క్లాసెస్ ఆఫ్ నాన్ సిటిజన్స్ ఎలిజిబుల్ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ అనే పేరుతో ఈ ముసాయిదా దాదాపు రెడీ అయ్యింది. గతంలో 2015లో అమల్లోకి తెచ్చిన హెచ్4 వర్క్ పర్మిట్ నిబంధనను పూర్తిగా వెనక్కి తీసుకుని, పాత పద్ధతినే పునరుద్ధరించాలని అధికారులు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేశారని తెలుస్తోంది.

ఇది అమలులోకి వస్తే ఆ ప్రభావం అత్యధికంగా ఇండియన్ ఫ్యామిలీస్ పైనే పడుతుంది.  గత పదేళ్ల కాలంలో జారీ అయిన హెచ్4 ఈఏడీ అనుమతుల్లో దాదాపు 93 శాతం భారతీయులకే లభించాయి. అందులోనూ దాదాపు 94 శాతం మంది భారతీయ మహిళలే ఉన్నారు.  ద్యోగ అనుమతులు రద్దయితే వేలాది మంది అర్హులైన మహిళలు తమ కెరీర్‌ను, ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోల్పోతారు.  

 ప్రస్తుతానికి ఇది ఒక ప్రతిపాదన స్థాయిలోనే  ఉన్నప్పటికీ.. అసలీ ప్రతిపాదనే ఆందోళన కలిగిస్తోంది.  ఈ నిబంధన తక్షణమే అమల్లోకి రాదని..  నిబంధనల ప్రకారం ఫెడరల్ రిజిస్టర్‌లో దీనిని అధికారికంగా ప్రచురించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉంటుంది. అలా  సేకరించిన అభిప్రాయాలను సమీక్షించిన అనంతరమే తుది మార్గదర్శకాలను విడుదల అవుతాయి. 

ఇటీవలి కాలంలో హెచ్1బీ వీసా వ్యవస్థపై అమెరికా యంత్రాంగం వరుసగా కఠిన నిబంధనలను పరిశీలిస్తోంది. నూతన హెచ్1బీ దరఖాస్తులపై ప్రాసెసింగ్ రుసుములను విపరీతంగా పెంచడం, ఉద్యోగం కోల్పోయిన టెక్కీలకు ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌పై పరిమితులు విధించడం వంటివి పరిశీలనలో ఉన్నాయి.  అమెరికాలో మంజూరవుతున్న మొత్తం హెచ్ 1బీ వీసాల్లో ఇంచుమించు 70 శాతం భారతీయులకే లభిస్తున్న నేపథ్యంలో ట్రంప్ నిర్ణయాలు విధానాలు ఎక్కువగా ఇండియన్స్ పైనే ప్రభావం చూపుతున్నాయి.  


H1B Visa, H4 EAD Work Permit, Donald Trump Immigration Policy, US Department of Homeland Security, Indian IT Professionals USA