అమెరికా స్కూల్లో పేలిన తుపాకి: ముగ్గురు చిన్నారులు మృతి.. నిందితుడి కాల్చివేత.!
Published on: Fri Oct 16, 2026 11:23AM
అమెరికాలో గన్ కల్చర్ వెర్రితలలు వేస్తున్నది. అగ్రరాజ్యంలో కాల్పుల సంస్కృతి చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అన్ని వయస్సుల వారికీ పాకుతోంది. తాజాగా ఓ 16 ఏళ్ల బాలుడు ఓ స్కూల్ లోకి జొరబడి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడి ముగ్గురు చిన్నారులు సహా నలుగురి ఉసురు తీశాడు. ఈ సంఘటన ఒరెగాన్ రాష్ట్రం బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్లో జరిగింది.
తుపాకీలో స్కూల్ లోకి చొరబడిన ఆ 16 ఏళ్ల బాలుడు.. తొలుత అంటే పాఠశాల ఆవరణలోకి ప్రవేశించడానికి ముందు అక్కడ ఉన్న ఓ వాహనంపై కాల్పులు జరిపాడు. ఆ తరువాత స్కూల్ లోకి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఐదు నుంచి ఎనిమిదేళ్ల మధ్య వయస్సు ఉన్న ముగ్గురు చిన్నారులు, ఓ ఉపాధ్యాయుు మరణించారు. మరో చిన్నారి, మరో ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
కాగా ఈ కాల్పుల అనంతరం పారిపోతున్న నిందితుడిని ఓ పౌరుడు వెంబడించి మరీ కాల్చి చంపాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికే నిందితుడు మరణించాడు. అయితే ఈ దాడికి అసలు కారణమేంటి? 16 ఏళ్ల బాలుడు ఇంతటి దారుణానికి ఎందుకు పాల్పడ్డాడు? పాఠశాలతో అతడికి ఏమైనా సంబంధం ఉందా? అన్న విషయాలపై క్లారిటీ లేదు.
[Gun Fire In America School, US School Shooting, Silver Rail Elementary School, Accused, 16Year Old Boy, Shotdead, Telugu One]


