TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాలుడి కిడ్నాప్.. సినీ ఫక్కీలో ఛేజ్ చేసి మరీ నిందితుడిని పట్టుకున్న పోలీసులు.!

Published on: Tue Sep 22, 2026 10:19AM

కిడ్నాప్ కు గురైన బాలుడిని పోలీసులు 15 గంటల వ్యవధిలోనే రక్షించిన ఉదంతమిది. గుజరాత్ లోని అమ్రేలి జిల్లాలో ఏ ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగా 170కి పైగా సీసీటీవీ కేమేరాల్లోని ఫుటేజీలను జల్లెడపట్టి, కిడ్నాపర్ ను వంద కిలోమీటర్లకు పైగా ఛేజ్ చేసి మరీ పట్టుకుని బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

సినీమాలో క్లైమాక్స్ సీన్ ను తలపించేలా జరిగిన కిడ్నాప్, చేజింగ్, బాలుడికి విముక్తి వివరాలిలా ఉన్నాయి.  అమ్రేలి జిల్లా మోటా అంకడియా గ్రామంలో  మధ్యప్రదేశ్ నుంచి వలస వచ్చిన రైతు కూలీల దంపతుల 5 ఏళ్ల కుమారుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. నిందితుడు లలిత్ రూప్‌సింగ్‌భాయ్ జామ్రే  కూడా మధ్యప్రదేశ్‌కు చెందినవాడే. ఆరు నెలల కిందటే బాధితుడి కుటుంబంతో పరిచయం ఏర్పరచుకున్న లలిత్, పది రోజుల కిందట  పని దొరికే వరకు  రైతు కూలీ దంపతుల ఇంట్లో ఆశ్రయం కోరాడు. అందుకు వారు అంగీకరించారు.  ఈ క్రమంలోనే లలిత్ సింగ్ బాలుడిని కిడ్నాప్ చేశారు. 

నిందితుడు తన వెంట మొబైల్ ఫోన్ తీసుకువెళ్లకపోవడంతో ఫోన్ ట్రాకింగ్ ద్వారా పట్టుకోవడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. దీంతో   పోలీసులు, ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అమ్రేలి నుంచి రాజ్‌కోట్ వైపు నిందితుడు మోటార్‌సైకిల్‌పై వెళ్లిన మార్గాన్ని గుర్తించారు. నెట్‌రామ్, త్రినేత్ర కమాండ్ సెంటర్ల సాయంతో రాజ్‌కోట్, పోర్‌బందర్ జాతీయ రహదారి, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ల పరిధిలోని 170కి పైగా సీసీటీవీ ఫుటేజ్‌లను జల్లెడ పట్టారు. దాదాపు 100 కిలోమీటర్ల దూరం వెంబడించిన తర్వాత, రాజ్‌కోట్ జిల్లా విర్‌పూర్ గ్రామంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని సురక్షితంగా కాపాడి, తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడిపై ఏర్పడిన ఇష్టంతోనే అతడిని తన సొంతూరు మధ్యప్రదేశ్‌కు తీసుకెళ్లాలని నిందితుడు భావించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఆపరేషన్, ఆధునిక టెక్నాలజీ, వివిధ జిల్లాల పోలీసుల సమన్వయం, మానవ మేధస్సు కలయికకు నిదర్శనంగా నిలిచింది.


[Gujarat Kidnapping Case, Boy Abduction, Gujarat Police Operation,  CCTV cameras, 100 Kilometer Chase, Rescue, Crime News]