TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆస్ట్రేలియా నెట్‌వర్క్‌ను కాపాడనున్న ప్రీ-లోడింగ్ టెక్నిక్! పూర్తి వివరాలు

Published on: Wed Nov 4, 2026 9:15AM

ఇంటర్నెట్ చరిత్రలో అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న వీడియో గేమ్‌లలో 'గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6' (GTA 6) ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గేమర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ గేమ్ నవంబర్ 19న అధికారికంగా లాంచ్ కానుంది. అయితే, ఈ గేమ్ ఫైల్ సైజ్ దాదాపు 210GB వరకు ఉండవచ్చని అంచనా వేయడంతో, ఆస్ట్రేలియాలో ఇంటర్నెట్ నెట్‌వర్క్ పై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ జోరుగా సాగింది. ఒకేసారి కోట్లాది మంది వినియోగదారులు డౌన్‌లోడ్ చేయడం వల్ల ఆస్ట్రేలియా నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ (NBN) క్రాస్ అవుతుందా లేదా నెట్‌వర్క్ కుప్పకూలుతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. 

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రముఖ టెలికాం నెట్‌వర్క్ సంస్థ ఎన్‌బీఎన్ కో (NBN Co) స్పందిస్తూ, తమ నెట్‌వర్క్ ఎలాంటి ఊహించని ఒత్తిడిలనైనా ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. గతంలో ఒక మేజర్ గేమ్ విడుదలైనప్పుడు ఎన్‌బీఎన్ ట్రాఫిక్ రికార్డు స్థాయిలో 32.91 Tbps (టెరాబిట్స్ పర్ సెకండ్) తాకిందని, ఇది సాధారణ స్థాయి కంటే దాదాపు 30 శాతం ఎక్కువగా ఉందని సంస్థ గుర్తుచేసింది. అయితే, ఈసారి జీటీఏ 6 లాంచ్ సమయంలో అలాంటి ప్రమాదం ఏమీ ఉండదని భరోసా ఇచ్చింది. దీనికి ప్రధాన కారణం 'ప్రీ-లోడింగ్' (Pre-loading) ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు. డిజిటల్ స్టోర్లలో గేమ్‌ను ముందస్తుగా ప్రీ-ఆర్డర్ చేసుకున్న వినియోగదారుల కోసం నవంబర్ 10 నుంచే ప్రీ-లోడింగ్ ప్రారంభం కానుంది. అలాగే కోడ్-ఇన్-బాక్స్ వెర్షన్ కొనుగోలుదారులకు నవంబర్ 12 నుంచి గేమ్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. దీనివల్ల ఆటగాళ్లు విడుదల తేదీకి ముందే వారం రోజుల ముందే గేమ్‌ను తమ సిస్టమ్స్‌లోకి డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. 

ఏకకాలంలో మిలియన్ల కొద్ది మంది ఒకేసారె సర్వర్‌లపై పడకుండా, ఈ వారం రోజుల సమయం ట్రాఫిక్‌ను విభజించడానికి ఎంతగానో సహాయపడుతుందని ఎన్‌బీఎన్ కో వెల్లడించింది. ఇది గేమర్స్‌కు మరియు నెట్‌వర్క్‌కు ఎంతో మేలు చేస్తుందని పేర్కొంది. కాగా, ఆస్ట్రేలియాలోని వివిధ ఎన్‌బీఎన్ స్పీడ్ ట్రియర్స్ ప్రకారం డౌన్‌లోడ్ వేగంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. ఉదాహరణకు, NBN 25 ప్లాన్‌పై 210GB గేమ్ డౌన్‌లోడ్ కావడానికి దాదాపు 18 గంటల 40 నిమిషాలు (సుమారు 19 గంటలు) పట్టవచ్చు. అదే NBN 100 ప్లాన్ అయితే 4 గంటల 40 నిమిషాలు, NBN 500 స్పీడ్ ప్లాన్ ద్వారా కేవలం 56 నిమిషాల్లోనే ఈ భారీ డౌన్‌లోడ్ పూర్తి చేసుకోవచ్చు. అత్యంత వేగవంతమైన NBN 2000 కనెక్షన్ అయితే కేవలం 14 నిమిషాల వ్యవధిలోనే గేమ్‌ను డౌన్‌లోడ్ చేసే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏది ఏమైనప్పటికీ, వారం రోజుల ముందే ప్రీ-లోడింగ్ చేసుకునే సదుపాయం ఉండటం వల్ల ఆస్ట్రేలియా ఇంటర్నెట్ నెట్‌వర్క్‌పై ఎలాంటి పెను ప్రభావం పడదని, రికార్డు స్థాయి డౌన్‌లోడ్ వాల్యూమ్‌లను కూడా తమ నెట్‌వర్క్ అవలీలగా తట్టుకోగలదని తేలిపోయింది.

 

 

 

[GTA 6, Grand Theft Auto 6, GTA 6 Release Date, Rockstar Games, NBN Co, Australia Internet Network, GTA 6 Download Size, GTA 6 Pre-Loading, NBN Broadband Speeds, Video Game Industry]