చట్టబద్ధ వలసలపై వేటు: పీఈఆర్ఎమ్ నుంచి దిగ్గజ కంపెనీల సస్పెన్షన్ పై విమర్శలు.!
Published on: Fri Oct 9, 2026 10:36AM

అమెరికాలో హెచ్-1బీ వీసాలపై ఆధారపడి నివసిస్తున్న టెక్కీలకు, నిపుణులకు డోనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఆచ్చారు. ఆయన తాజా నిర్ణయం టెక్కీలను మరీ ముఖ్యంగా ఇండియన్ టెక్కీల భవిష్యత్ ను డోలాయమానంలో పడేసింది. గ్రీన్‌కార్డ్ ప్రక్రియలో కీలకమైన పీఈఆర్ఎమ్ ప్రోగ్రాం నుంచి మైక్రోసాఫ్ట్ సహా మరో ఏడు ఐటీ దిగ్గజ కంపెనీలను ట్రంప్ సర్కార్ సస్పెండ్ చేసింది.
ఈ నిషేధిత జాబితాలో మైక్రోసాఫ్ట్ తో పాటు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి ఇండియన్ దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. హెచ్-1బీ వ్యవస్థ దుర్వినియోగం అవుతోందన్న ఆరోపణలు, అమెరికన్లను ఉద్యోగ మార్కెట్ నుంచి దూరం చేస్తున్నాన్న అనుమానాలు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణంగా చెబుతున్నారు. అయితే ట్రంప్ నిర్ణయం పట్ల అమెరికాలో కూడా దుమారం రేగుతోంది.

భారత సంతతికి చెందిన మెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. చట్టబద్ధ వలసలపై దాడిగా ట్రంప్ నిర్ణయాన్ని అభివర్ణించారు. విదేశీ నిపుణులపై ఆధారపడే ప్రముఖ సంస్థలను టార్గెట్ చేయడం ద్వారా అమెరికా నూతన ఆవిష్కరణల సామర్థ్యం దెబ్బతింటుందని ఆమో ఆందోళన వ్యక్తం చేశారు. విచ్ఛిన్నమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను చక్కది ద్దడానికి చట్టబద్ధమైన మార్గాలను ధ్వంసం చేయడం సరైన పద్ధతి కాదన్న ప్రమీలా జయపాల్.. మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఎప్పుడూ సరైన ఆధునిక వలస విధానాల కోసం, మెరుగైన చట్టపరమైన మార్గాల కోసం పోరాడాయని గుర్తుచేశారు. ఈ సస్పెన్షన్ ఎంతకాలం కొనసాగుతుందనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో, అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది టెక్కీలు పరిస్థితి అయోమయంగా మారింది.
[Green Card Suspension, Trump Administration, Pramila Jayapal, Indian Tech workers, H1B visa, IT Giants PERM, Telugu One]


