ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. విశాఖ తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం.!
Published on: Wed Aug 26, 2026 2:30PM

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. జీవనది గోదావరి జలాలను ఉత్తరాంధ్ర జిల్లాలకు తరలించే కార్యక్రమం తుది దశకు చేరుకుంది. విశాఖపట్నం, అనకాపల్లి పరిధిలోని వ్యవసాయ రంగానికి సాగునీరు అందించడంతో పాటు, ఆయా ప్రాంతాల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన పనులు దాదాపు పూర్తి కావచ్చాయి.
పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్ర వైపు మళ్లించే ప్రక్రియ చివరి దశకు వచ్చింది. ఈ కాలువ ద్వారా విశాఖ నగరం, చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు నీటి లభ్యత పెరుగుతుంది. అలాగే అనకాపల్లి జిల్లాలోని వేలాది ఎకరాల భూములకు సాగునీరు అందుబాటులోకి వస్తుంది.
గతంలో పలు కారణాలతో జాప్యం అయిన ఈ పనులు.. తెలుగదేశం కూటమి ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టిన తరువాత వేగం పుంజుకున్నాయి. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పోలవరం ఎడమ కాలువపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులను పరుగులెత్తించింది. సాంకేతిక సమస్యలు, పరిహార చెల్లింపులు వంటి అడ్డంకులను విజయంతంగా అధిగమించింది.
ఎడమకాలువ ద్వారా గోదావరి జలాల తరలింపు తరలింపు ఉత్తరాంధ్ర రూపురేకలను మార్చేస్తుందని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. గోదావరి జలాలతో విశాఖ తాగునీటి ఎద్దడి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఎడమ కాలువకు సంబంధించిన మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి, జలాలను కాలువలోకి విడుదల చేయడానికి అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. దీంతో రానున్న రోజులలో గోదావరి జలాలు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకంగా మారతాయని అంటున్నారు.
Godavart water to Uttarandhra, Polavaram Left Canal, Visakhapatnam Drinking Water, Anakapalli Irrigation, Water Resources Department, CBN


