శభాష్ గాయత్రీ: మానవ సేవే మాధవ సేవ స్ఫూర్తిని చాటారు: చంద్రబాబు ప్రశంసలు.!
Published on: Wed Oct 7, 2026 10:15AM

మానవ సేవే మాధవ సేవ అంటారు.. అటువంటిది మాధవుడి సన్నిధిలోనే మానవ సేవ చేసి అందరి ప్రశంసలూ అందుకుంది గాయత్రి అనే ఉద్యోగిని. ఆమె సేవకు ఫిదా అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చం్రబాబునాయుడు ఆమెను అభినందించారు.
అసలింతకీ విషయమేంటంటే.. చిన్న తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం నిత్యాన్నదాన కేంద్రంలో పని చేసే గాయత్రి అనే ఉద్యోగిని ఈ నెల 3న విధి నిర్వహణలో ఉండగా, భీమడోలు మండలంమండలం పాతూరు గ్రామానికి చెందిన దివ్యాంగ భక్తుడు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించున్న అనంతరం అన్నదాన కేంద్రానికి వెళ్లాడు.
.webp)
రెండు చేతులూ లేని ఆ భక్తులు భోజనం చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇది గమనించిన గాయత్రి.. వెంటనే అతని వద్దకు వెళ్లి అన్నం కలిపి స్వయంగా తినిపించారు. ఆమె అలా అన్న తినిపిస్తున్న దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి వెంటనే వైరల్ అయ్యాయి. నెటిజనులు ఆమెను నిజమైన భగవంతుడి సేవకురాలిగా అభివర్ణిస్తూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన శభాష్ గాయత్రీ అంటూ ప్రశంసించారు. దివ్యాంగ భక్తుడికి అన్నం తినిపించి ఆకలి తీర్చిన ఆమె సహృదయానికి వందనాలు తెలిపారు.
మానవ సేవే మాధవ సేవ స్ఫూర్తిని గాయత్రీ తన చర్యతో చాటిచెప్పారని చంద్రబాబు ప్రశంసించారు. విధుల్లో భాగంగా భక్తులకు సేవలందించే ఆమె.. ఓ భక్తుడి ఇబ్బందిని ప్రత్యేకంగా గుర్తించి స్వయంగా సహాయం చేయడం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచింది.
ఇదిలా ఉండగా, గాయత్రీ సేవాభావాన్ని ద్వారకాతిరుమల ఆలయ ఈవో వెండ్ర త్రినాథరావు అభినందించారు. ఆలయంలోని అన్నదాన భవనంలో ఆమెను శాలువాతో సత్కరించి, స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. తోటి మనిషి పట్ల గాయత్రీ చూపిన నిస్వార్థ సేవాభావం ప్రశంసనీయమని ఈవో పేర్కొన్నారు.
[Gayatri Godly Service Differently Abled Devotee, Dwaraka Tirumala, Chandrababu,Praise, Service to Humanity, service to God, AP News, Dwaraka Tirumala, Telugu One]


