వినాయక నిమజ్జనాల్లో విషాదాలు.. తెలంగాణలో13 మంది మృతి
Published on: Sat Sep 26, 2026 1:18PM
.webp)
తెలంగాణలో వినాయక నిమజ్జనోత్సవాలలో తెలంగాణలో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాల సందర్భంగా ఎస్సై సహా 13 మంది ప్రాణాలు కోల్పోగా.. 26 మంది గాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 1.24 లక్షల మండపాల్లో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. జియో ట్యాగింగ్, పోర్టల్‌లో నమోదైన వివరాల ఆధారంగా ఈ సంఖ్యను గుర్తించినట్లు చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సుమారు 8 వేల విగ్రహాలు పెరిగాయని వెల్లడించారు. ఇళ్లలో, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలో ఏర్పాటు చేసిన విగ్రహాలను కలుపుకుంటే ఈ సంఖ్య 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉండొచ్చని తెలిపారు.గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 25)ఒక్కరోజే 6,350 విగ్రహాల నిమజ్జనం జరిగిందని వెల్లడించారు.
.webp)
వినాయక నిమజ్జనాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. సుమారు పాతిక వేల మంది పోలీసులను విధుల్లో మోహరించినట్లు చెప్పారు. నిమజ్జన మార్గాలు, ప్రధాన కూడళ్లు, చెరువులు, జలాశయాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు వివరించారు.ఐసీసీసీ, డీజీపీ కార్యాలయం నుంచి నిమజ్జన పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. పోలీసు బృందాలు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించడంతో పాటు ఏరియల్ సర్వే కూడా నిర్వహించినట్లు చెప్పారు.
[Ganesh Nimajjanam, Shobha Yatra, Tragedies, 13Dead, Several Incidents, DGP CV Anand, Telugu One]


