గాదె ఇన్నయ్యకు మధ్యంతర బెయిల్

posted on: Jun 5, 2026 5:46PM

 

చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రతినిధి, సామాజిక హక్కుల నాయకుడు గాదె ఇన్నయ్యకు నాంపల్లి కోర్టు రెండు నెలల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. గాదె ఇన్నయ్యను ఎన్‌ఐఏ అధికారులు యూఏపీఏ కేసులో అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యక్తిగత, ఆరోగ్య కారణాలను చూపుతూ తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోర్టును ఆశ్రయిం చారు.

ఇన్నయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు, ఆయన వ్యక్తిగత మరియు ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రెండు నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు శుక్రవారం చంచల్‌గూడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. అయితే బెయిల్ గడువు ముగిసిన అనంతరం తిరిగి లొంగిపోవాలని కోర్టు స్పష్టం చేసింది. విడుదల సంద ర్భంగా కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కోర్టు వద్దకు చేరుకుని ఇన్నయ్య ను స్వాగతించారు. 

ఇన్నయ్యకు మధ్యంతర బెయిల్ లభించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుతో ఆయన తాత్కా లికంగా జైలు నుండి బయటకు రావడానికి అవకాశం లభించింది. అయితే యు ఏ పి ఏ కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు విధించిన అన్ని షరతులను పాటించాలని ఆదేశించినట్లు సమాచారం.. మద్యంతర బేలు పూర్తి అయిన తర్వాత తిరిగి ఆయనే అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది..ప్రస్తుతం ఆయన రెండు నెలలపాటు మధ్యంతర బెయిల్‌పై బయట ఉండనున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...