ప్రధాని మోడీ స్వాతంత్ర్య సమరయోధుడా?
Published on: Tue Sep 8, 2026 3:25PM

దేశ స్వాతంత్య్రానంతరం జన్మించిన ప్రధాని నరేంద్రమోడీని స్వాతంత్ర్య సమరయోధుడిగా అభివర్షిస్తూ ఓ కోచింగ్ సెంటర్ స్టడీ మెడిరియల్ లో పేర్కొనడం దుమారానికి దారి తీసింది. దీనిపై నెట్టింట ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది.
ఒక కోచింగ్ సంస్థకు చెందిన గైడ్‌బుక్‌లో జాతిపిత మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి మహానీయుల సరసన ప్రధాని నరేంద్ర మోడీ పేరును, ఆయన ఫోటోను ముద్రించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను త్యాగం చేసిన చారిత్రక వీరుల పక్కన ప్రస్తుత ప్రధానిని ఉంచడం పట్ల విద్యార్థులు, మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చరిత్రను వక్రీకరించేలా ఉన్న ఈ స్టడీమెటీరియన్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిజానికి, నరేంద్ర మోడీ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సుమారు మూడేళ్ల తర్వాత, అంటే 1950 సెప్టెంబర్ 17న జన్మించారు. 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, స్వాతంత్ర్యం తర్వాత జన్మించిన తొలి ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. అలాంటి వ్యక్తిని స్వాతంత్ర్య పోరాట యోధుడిగా అభివర్ణించడం చారిత్రను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వివాదాస్పద పుస్తకంలో కేవలం మోడీ పేరు మాత్రమే కాకుండా, ఆయనకు సంబంధించిన పలు ప్రచార నినాదాలు, ప్రకటనలను కూడా పొందుపరిచారు. మెయిన్ భీ చౌకీదార్ వంటి నినాదాలతో పాటు జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ వంటి పలు కీలక అంశాలను కూడా ఒకే చోట చేర్చడం గమనార్హం. ఈ పుస్తకంలోని పేజీ నంబర్ 56 వద్ద ఈ వివరాలు ఉండటంతో, నెటిజన్లు దీనిని 56 అంగుళాల ఛాతీ నినాదంతో ముడిపెట్టి ట్రోల్ చేస్తున్నారు.
పోటీ పరీక్షల విద్యార్థుల కోసం అందించే ఎడ్యుకేషన్ మెీరియల్ లో రాజకీయ నాయకుల ప్రచార కంటెంట్ లేదా రాజకీయ నినాదాలను చేర్చడం ప్రమాదకరమని విద్యారంగ నిపుణులు అంటున్నారు. ఇది విద్యార్థుల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసే ప్రయత్నమని, రాజకీయ భావజాలాన్ని చిన్ననాటి నుంచే బలవంతంగా విద్యార్థుల మదిలో నాటేందుకు జరుగుతున్న కుట్ర అనీ విమర్శిస్తున్నారు. ఈ వివాదంపై సంబంధిత కోచింగ్ సంస్థలు లేదా ప్రచురణకర్తల నుంచి స్పందన రాలేదు.
[Freedom Fighter PM Modi, coaching book, Modi freedom fighter controversy, Indian coaching institute textbook, Narendra Modi birth year 1950, social media backlash PM Modi book, Telugu One]


