కేటీఆర్ పాస్ పోర్టు సీజ్: కారణమేంటో తెలుసా?
Published on: Tue Sep 29, 2026 10:41AM

హైదరాబాద్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పాస్ పోర్టును ఏసీబీ కోర్టు సీజ్ చేసింది.
ఈ కేసులో కేటీఆర్ తో పాటు మరో ముగ్గురు నిందితుల పాస్ పోర్టులను సీజ్ చేయాలని కోరుతూ ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఏసీబీ కోర్టులో పటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ విచారించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు.. కేసీఆర్, మరో ముగ్గురి పాస్ పోర్టులను తాతా్కలికంగా సీజ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిందితుల ప్రయాణాలపై ఆంక్షలు విధించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ఆదేశించింది.
గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా-ఈ రేసు నిర్వహణలో నిధుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రస్తుత ప్రభుత్వం ఆదేశించడంతో, ఏసీబీ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టిన సంగతి విదితమే.
ఈ విచారణలో భాగంగా దర్యాప్తు అధికారులు సేకరించిన ప్రాథమిక సాక్ష్యాధారాల ఆధారంగా 2024 డిసెంబరులో పలువురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు, అప్పట్లో పురపాలక పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఫార్ములా-ఈ ఆపరేషన్స్ ప్రతినిధి అల్బెర్టో లోంగోలను నిందితులుగా చేర్చారు.

కేసుకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు నిందితులను విచారించి వారి వాంగ్మూలాలు రికార్డు చేశారు. , న్యాయస్థానంలో ఛార్జిషీట్లను కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణ దశలో కొనసాగుతోంది. అయితే.. ఆర్థిక నేర ఆరోపణలు, అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు విచారణను ఎదుర్కొనేందుకు అందుబాటులో లేకుండా విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని పేర్కొంటూ.. వారి పాస్‌పోర్ట్‌లను నిలిపివేయాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఏసీబీ పిటిషన్ ను పరిశీలించి వారి పాస్ పోర్టులను తాత్కాలికంగా జప్పు చేసింది.
[Formula E Race Case, KTR Passport Seized, ACB Court Hyderabad, BRS KTR News, Telangana Politics, Telugu One]


