హైకోర్టును ఆశ్రయించిన మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్..!
Published on: Tue Aug 25, 2026 7:24PM

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కేసు నమోదైన అనంతరం సుమంత్ పరారయ్యాడు. హైదరాబాద్‌లోని పలు అనుమానాస్పద ప్రాంతాల్లో ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అయితే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమంత్‌ను ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడంపై పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమంత్ ఓ మంత్రి నివాసంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా మరోవైపు సుమంత్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. తనపై హత్యాయత్నం కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒకవైపు ముగ్గురు నిందితుల అరెస్టు అవ్వడం... మరోవైపు సుమంత్ కోర్టును ఆశ్రయించడం.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Former OSD Sumanth, Minister Konda Surekha, Task Force Police, Telangana High Court, CM Revanth reddy, CP Sajjanar


