TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యాంటీ మోడీగా విదేశీ మీడియా: జెన్ జీ ఆందోళనలకు విస్తృత కవరేజి.!

Published on: Tue Oct 13, 2026 3:45PM

వివాదాస్పద ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) తీరును నిరసిస్తూ ఉద్ధృతమవుతున్న ఆందోళనలు దేశ రాజధానిలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విపక్ష  ఇండియా’ కూటమి తో పాటు కాక్రోచ్ జనతా పార్టీ  నేతృత్వంలో సాగుతున్న ఈ నిరసనల్లో విద్యార్థి, యువజన సంఘాలు పెద్ద ఎత్తున భాగస్వామ్యమవుతున్నాయి. ఈ పరిణామాలు   దేశవ్యాప్తంగానే కాదు, సరిహద్దులు దాటి అంతర్జాతీయంగానూ హాట్ టాపిక్ గా మారాయి. 

రాయిటర్స్, బ్లూమ్‌బెర్గ్, సీఎన్ఎన్, అల్ జజీరా వంటి ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలతో పాటు పలు విదేశీ వార్తా పత్రికలు, సోషల్ మీడియా హ్యాండిల్స్, జపనీస్ మీడియా సైతం ఢిల్లీ ఆందోళనలకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తున్నాయి.  దేశంలో జరుగుతున్న నిరసనలకు  ప్రపంచ దేశాల మీడియాలో ఈ స్థాయి ప్రచారం, ప్రాధాన్యత లభించడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది.  ఈ విస్తృత కవరేజ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రభుత్వంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే..  ఈ విదేశీ మీడియా విస్తృత కవరేజ్ ఒక ఎత్తైతే.. ఆ కవరేజ్ పూర్తిగా మోడీ సర్కార్ కు వ్యతిరేక ప్రచారంగా, అదే సమయంలో   యువత పోరాటాన్ని ప్రత్యేకంగా హైలైట్ చేస్తూ సమర్థిస్తుండటం మరో ఎత్తుగా మారింది. 

ఈ పరిణామాల కారణంగా, విదేశీ ప్రజల్లో ఈ నిరసనలు కేవలం రాజకీయ పార్టీల స్వార్థపూరిత ఎజెండాలుగా కాకుండా, యువత స్వచ్ఛంగా లేవనెత్తుతున్న ప్రజా సమస్యలుగా గుర్తింపు పొందుతున్నాయి. సాధారణ పౌరులు,  యువత నుంచి వస్తున్న ఈ ఆందోళనలు, వాటికి లభిస్తున్న ప్రచారం  ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన ప్రజా అభిప్రాయాన్ని నిర్మించే అవకాశాలను కొట్టిపారేయలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఈ ఆందోళనలు, వాటికి దేశ, విదేశీ మీడియాలోలభిస్తున్న విస్తృత ప్రచారం ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయంపై ఓ రేంజ్ లో వ్యతిరేకత ఏర్పడేందుకు దోహదం చేస్తున్నది.  ముఖ్యంగా ఎసీఈసీ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలుకేంద్రంలోని మోడీ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత గూడుకట్టుకోవడానికి దోహదం చేస్తున్నాయని అంటున్నారు.  ఇక విదేశీ మీడియాలో ఈ ఆందోళనలకు లభిస్తున్న విశేష ప్రాధాన్యత.. అంతర్జాతీయంగా మోడీ సర్కార్ ప్రతిష్టను మసకబారుస్తున్నాయని అంటున్నారు. 

ఈ ఆందోళనలకు సంబంధించి కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. ఆందోళనలను వాటంతటవే చల్లారిపోతాయన్న ధోరణిలో కేంద్రం వ్యవహరిస్తే.. ప్రతిష్ఠ మరింత మసకబారే అవకాశం ఉందంటున్నారు. ఇక ఈ ఆందోళనలకు అంతర్జాతీయ మీడియా కవరేజ్ కూడా మోడీకి ఒకింత ఇబ్బందికరంగానే పరిణమించిందని చెప్పాలి. ఇంత కాలం తన దౌత్యవిధానాల ద్వారా మోడీ అంతర్జాతీయంగా పెంచుకున్నపలుకుబడి ఇప్పుడీ ఆందోళనల కారణంగా పలుచన అయ్యే ప్రమాదం లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 


[Foreign Media Anti Modi Government Propaganda, Delhi CEC Protests, Cockroach Janta Party CJP, International Coverage, Indian Political News, Telugu One]