Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కార్ల సర్వీస్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం
posted on: Feb 10, 2026 9:46AM
.webp)
హైదరాబాద్ అత్తాపూర్ లోని ఓ కార్ల షోరూమ్‌కు అనుబంధంగా ఉన్న సర్వీస్ సెంటర్‌లో మంగళవారం (ఫిబ్రవరి 10) తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా చెలరేగిన మంటల కారణంగా సర్వీస్ సెంటర్‌లో ఉన్న పలు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో సెంటర్‌లో దాదాపు 50 కార్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మంటలు వేగంగా వ్యాపించ డంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
సర్వీస్ సెంటర్‌కు ఆనుకుని ఉన్న అపార్ట్‌మెంట్‌కు మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు ముందస్తు చర్యగా అక్కడ నివసిస్తున్న సుమారు 90 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని చెబుతున్నారు.
సర్వీస్ సెంటర్ నిర్వాహకుు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే అగ్నిప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు షోరూమ్ యజమానులు మాత్రం ఈ అగ్నిప్రమాదం వెనుక కుట్రకోణం ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అగ్నిప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


.webp)



