ప్రజలే ప్రజాస్వామ్యం బలం బలగం.. నారా లోకేష్ ట్వీట్

తెలుగురాష్ట్రాలలో ఓటింగ్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఏపీలో ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలైన్లలో నిలుచుని తమ ఓటు హక్కు వినియోగించుకుంటామన్న పట్లుదల కనబరిచారు. 

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దంపతులు మంగళగిరి లో ఓటు వేశారు.  ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్‌లో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు వేశారు. అనంతరం నారా లోకేష్ ప్రజలే ప్రజాస్వామ్యం బలం బలగం అంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మార్పుకోరుకోవడం కంటే మర్పు మనతోనే మొదలు కావాలన్న సంకల్పం ముఖ్యం అని పేర్కొన్నారు.

మన భవిష్యత్ ముడిపడి ఉన్న ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.  ఇక పోతే తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు కూడా ఉదయాన్నే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే సీఎం జగన్ దంపతులు పులివెందులలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.