వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్

 

అవాంతరాలు లేని హైవే ప్రయాణం అందించడమే లక్ష్యంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.   ఫాస్టాగ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా వార్షిక పాస్‌ను తీసుకువస్తున్నది. ఆగస్టు 15 నుంచి అందుబాటులోనికి రానున్న ఈ సాస్ జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉ:టుంది.    
ఈ కొత్త  ఫాస్టాగ్   పాస్ ను 3వేల రూపాయలు చెల్లించి తీసుకుంటే.. దానిని ఉపయోగించి  ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు చెల్లుబాటు అవుతుంది.  ఈ పాస్టాగ్ పాస్ ను  కార్లు, జీపులు, వ్యాన్‌ల వంటి నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది.   ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. రాజ్ మార్గ్ యాత్ర యాప్ ద్వారా ఈ పాస్ తీసుకోవచ్చునని తెలిపారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu