Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైదరాబాద్‌లో కల్తీ స్వీట్ల కలకలం
posted on: Feb 17, 2026 4:00PM

హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్‌లో ప్రసిద్ధి చెందిన హల్దీరాం స్వీట్ హౌస్‌లో కల్తీ, ఫంగస్ పట్టిన స్వీట్లు విక్రయించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పాడైపోయిన స్వీట్లను కస్టమర్లకు అమ్ముతున్నారని ఆగ్రహం చెందిన బాధితులు పోలీసు లను ఆశ్రయించారు. దీంతో అత్తాపూర్ పోలీసులు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హల్దీ రామ్ స్వీట్ హౌస్ పై కేసు నమోదు చేశారు. ఇటీవల స్వీట్ హౌస్‌లో కొనుగోలు చేసిన స్వీట్లలో ఫంగస్ కనిపించ డంతో కొంతమంది బాధితులు షాపు నిర్వాహకులను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వ కుండా నిర్లక్ష్యంగా వ్యవహ రించినట్లు తెలిపారు.
కొన్ని స్వీట్లు పూర్తిగా పాడై పోయినా వాటిని విక్రయించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. వినియోగదారుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని భావించిన కస్టమర్లు అందరూ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి అల్దీరాం స్వీట్ హౌస్‌పై బీఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్లు 79, 274, 275, 115(2), 131, 352 కింద కేసు నమోదు చేశారు. దుకాణం లో ఉన్న అనుమానాస్పద స్వీట్ల నమూనాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్)కు పంపించారు.
పరీక్షల నివేదిక వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళ నకు దారితీసింది. నగరంలో మంచి పేరున్న స్వీట్ హౌస్‌లోనే ఇలాంటి ఘటన వెలుగులోకి రావడంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహార పదార్థాల నాణ్యతపై సంబంధిత శాఖలు కఠినం గా తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగా టమాడితే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఆహార పదార్థాల విక్రయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత వ్యాపారులపై ఉందని, నిర్లక్ష్యం ప్రాణాం తక పరిణామాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఫోరెన్సిక్ నివేదిక వెలువడిన తర్వాత ఈ కేసులో మరిన్ని సెక్షన్లు చేర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.... ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే స్పందించి నగరంలో ఉన్న అన్ని స్వీట్ షాప్ లపై కొరడా ఝళిపించాను న్నారు.


.webp)



